Home Cinema Salaar Release Trailer: సలార్ రిలీజ్ ట్రైలర్ చూసి అంచనాలు ఇలా వేస్తున్న ఆడియన్స్..

Salaar Release Trailer: సలార్ రిలీజ్ ట్రైలర్ చూసి అంచనాలు ఇలా వేస్తున్న ఆడియన్స్..

audians-comments-on-prabhas-movie-salaar-release-trailer

Salaar Release Trailer: ప్రభాస్ అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అయిన సలార్ పై అందరికీ భారీ ( Salaar Release Trailer ) అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ చూసిన తర్వాత.. ఈ సినిమా కేజిఎఫ్ కు దగ్గరగానే ఉందని అందరూ అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఇప్పటివరకు తన కెరీర్ లో ప్రభాస్ నటించని ఒక కొత్త తరహా పాత్రలో నటిస్తున్నాడని ప్రభాస్ చెప్పడం జరిగింది. మరి ఈ సినిమాలో అంత కొత్తగా ఏం కనిపిస్తుందో చూడాలి మరి.

See also  Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం.. తరలి వస్తున్న ఇండస్ట్రీ..

Prabhas-movie-salaar-release-trailer-audians

ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది. చాలా సార్లు ఇప్పటికే పోస్ట్ ఫోన్ చేసుకుంటూ ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంత కాలానికి దగ్గరకు వచ్చింది. డిసెంబర్ 22వ తేదీ రిలీజ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ( Salaar Release Trailer ) రిలీజ్ డేట్ దగ్గరికి రావడంతో సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే.. ఈ సినిమా ఇంకొంచెం అంచనాలను పెంచుకున్నట్టుగానే అనిపిస్తుంది. కాకపోతే సినిమాలో ప్రభాస్ ఎంత హైలెట్ అవుతాడు, సినిమా ఎంత కలెక్షన్స్ తెచ్చిపెడుతుంది, ఎంత బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి.

See also  Prabhas : చివరికి ప్రభాస్ ఆమె గురించి బయట పెట్టేసిన పచ్చి నిజం..

Prabhas-movie-salaar-release-trailer-commetns

ట్రైలర్ చూస్తుంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు జర్నీ ఈ సినిమా అని తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ తన స్నేహితుడంటే ప్రాణం అని అర్థమవుతుంది. తన స్నేహితుడు కోసం ఏది కావాలన్నా చేస్తాడు. తన స్నేహితుడు ఏది కావాలంటే తెస్తాడు, ఏది వద్దంటే దాన్ని నాశనం చేస్తాడు. అయితే ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎలా ( Salaar Release Trailer ) మారుతారు అనేదే ఈ సినిమా అని అర్థమవుతుంది. ఇకపోతే ఈ సినిమా గురించి ఇప్పటివరకు శృతిహాసన్ పెద్దగా ఏ ట్రైలర్ లోనూ చూపించలేదని అందరూ మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సలార్ రిలీజ్ ట్రైలర్లో శృతిహాసన్ కి కొంత టైం ఇచ్చారు.

See also  Chiranjeevi- Jr NTR : చిరంజీవికి అన్యాయం చేసిన జూనియర్ ఎన్టీఆర్..

Prabhas-movie-salaar-release-trailer

సలార్ రిలీజ్ ట్రైలర్లో శృతిహాసన్ కొంచెం కనిపించింది. ఒక ముఖ్యమైన పాత్ర ఈ సినిమాలో ఆమెది అర్థమవుతుంది. ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారడానికి గాని శృతిహాసన్ కారణమవుతుందా అనేది అనిపిస్తుంది. అసలు శృతిహాసన్ పాత్ర ఏమిటి అనేది పూర్తిగా అర్థం కాలేదు కానీ.. ముఖ్యమైన పాత్ర మాత్రం ఆమెకు ఉంది అని మాత్రం తెలుస్తుంది. కేవలం హీరోయిన్గా గ్లామర్ రోల్ కి మాత్రమే అంకితం కాకుండా.. కథలో ఇన్వాల్వ్ అయి ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్, శృతిహాసన్ ముగ్గురు పోటీపడి నటించారని అంటున్నారు. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ తెస్తుందో 22వ తేదీన తెలుసుకోవాలి.