Home Cinema Prabhas: ప్రభాస్ మీద వేణుస్వామి కామెంట్స్ వింటే ఊహు అంటారా? ఉలిక్కిపడతారా?

Prabhas: ప్రభాస్ మీద వేణుస్వామి కామెంట్స్ వింటే ఊహు అంటారా? ఉలిక్కిపడతారా?

సామాన్యులు నుంచి సెలెబ్రెటీస్ వరకు ఈరోజుల్లో చాలామంది జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారు. నమ్మినా, నమ్మకపోయినా ఎం జరిగింది, ఎం జరగబోతుంది తెలుసుకోవాలనే ఆత్రుత చాలామందిలో ఉంటాది. అందుకే ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో పండితుల హవా చాలా బాగా నడుస్తుంది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఎప్పటికప్పుడు సెలబ్రెటీస్ గురించి జరగబోయేది చెబుతూ… ఆయన నెటిజనులకు అందుబాటులో ఉంటున్నారు. ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గున్నారు.

ఆ ఇంటర్వ్యూ లో ఆయన అనేక విషయాలు గురించి చెప్పారు. అందులో ఆయన కొన్ని ఆశక్తికరమైన విషయాల గురించి చెప్పారు. ఈయన ప్రభాస్ జాతకం గురించి పలు విషయాలను చెప్పారు. ప్రభాస్ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఆయన ఆరోగ్య విషయంలో అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని చెప్పారు. అంతేకాదు ఇకమీదట ప్రభాస్ సినిమాలు ఊహించినంత హిట్స్ రావని, ఎంత పెద్ద సినిమా తీసినా, రిజల్ట్ మాత్రం యావరేజ్ గానే ఉంటుందని అన్నారు.

See also  Allu Arjun: పార్టీలో ఆ హీరోయిన్ గురించి అల్లు అర్జున్ ఇంత నీచంగా మాట్లాడాడా..


ప్రభాస్ ఫాన్స్ ఆశించినట్టుగా అంత సూపర్, డూపర్ హిట్స్ రావని అన్నారు. ఇది ప్రభాస్ ఫాన్స్ కి మాత్రమే కాదు, ప్రభాస్ ప్రొడ్యూసర్స్ కి కూడా టెంక్షన్ ఇచ్చే మాట. అయితే వేణుస్వామి మాటలను ఎంతవరకు తీసుకోవచ్చు అని అనుకుంటే… నాగచైతన్య, సమంత ల పెళ్లి విషయంలో ఆయన చాలా కరెక్ట్ గా చెప్పారు. వీళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా ఎంతో కాలం కలిసి ఉండరని వేణుస్వామి చెప్పారు. అప్పుడు ఆ మాటను అందరూ లైట్ తీసుకున్నారు గాని, ఆ మాట నిజం అయ్యాక వేణుస్వామి మాత్రం బాగా పాపులర్ అయ్యారు.

See also  Lakshmi Pranathi: చార్మినార్ నైట్ బజార్ లో షాపింగ్ చేస్తూ కనిపించిన ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి!

ప్రస్తుతం ప్రభాస్ ఎంత ఫేమ్ ఉన్న హీరో అనేది మనందరికీ తెలుసు. అలాంటి హీరో సినిమాలు ఎంత భారీగా తీసినా అవి పెద్ద హిట్ కావు అనే వేణుస్వామి మాటకి ప్రభాస్ ఫాన్స్ “ఊహూ” అంటారా? లేక సినిమా నిర్మాతలు “ఉలిక్కిపడతారా”?