
Anushka Shetty : అనుష్క అంటే తెలుగు సినీ ఆడియన్స్ అందరికీ ఎంత ఇష్టమో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అనుష్క తన మొదటి సినిమా నాగార్జునతో కలిసి చేసింది. నాగార్జున సినిమా సూపర్ లో ( Anushka Shetty posted that post suddenly ) ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. అక్కడి నుంచి మొదలుపెట్టిన తన పయనాన్ని ఎంతో అద్భుతమైన దారిలో తీసుకుని వెళ్ళింది. అనుష్క సినీ కెరీర్లో చెప్పుకోదగ్గ ఎన్నో సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా అరుంధతి, బాహుబలి ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి.
బాహుబలి, బాహుబలి 2 సినిమాల తర్వాత అనుష్క సినిమా రంగానికి కొంచెం దూరంగా ఉందని చెప్పుకోవాలి. ఆమె సినిమాలు అంతగా కనిపించలేదు. ఆ సినిమా తర్వాత 2023లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ( Anushka Shetty posted that post suddenly ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మళ్లీ తన సత్తాను చాటింది. ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది అనుష్క. సినిమాలకు మాత్రమే కాకుండా సోషల్ మీడియా కూడా దూరంగానే ఉంటుంది. ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తుంది.
అలాగే తెలుగులో క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఏదేమైనా అనుష్క సినిమా మళ్లీ రాబోతుందంటే.. ఆమె అభిమానులందరికీ పండగగానే ఉంటుంది. అటు సినిమాలకు, ఇటు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండే అనుష్క.. సడన్గా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ( Anushka Shetty posted that post suddenly ) పోస్ట్ చేసింది. అది చూసిన నెటిజనులందరూ అనేక రకాలుగా స్పందిస్తున్నారు. బాహుబలి సినిమాలో ఒక ఫోటోని సోషల్ మీడియాలో అనుష్క పోస్ట్ చేసింది. 7 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి సినిమా నుంచి అనుష్క ఆ సినిమాలో ఉన్న గెటప్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని ఒక్కొక్కరు ఒక్కోరకంగా చెప్తున్నారు. అయితే బాహుబలి 3 వస్తుందని సంకేతమేమో అందుకే ఆ ఫోటో పోస్ట్ చేసిందేమో అని అంటున్నారు. అంతేకాకుండా రాజాసాబ్ లో ప్రభాస్ వేసుకున్న రెడ్ కలర్ సూట్ కి.. తన చీర మ్యాచింగ్ అవ్వాలని షేర్ చేసిందేమో అని మరికొందరంటున్నారు. ఏదేమైనా అనుష్క పోస్ట్ చేసిన ఆ ఒక్క పోస్టుతో సోషల్ మీడియా అంతా స్పందించి ఆ పోస్ట్ ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు.