Home Cinema Anushka : అనుష్క అసలు విషయం బయటపడిపోయింది.. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి?

Anushka : అనుష్క అసలు విషయం బయటపడిపోయింది.. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి?

anushka-revealed-a-video-to-fans-saying-thanks-for-the-success-of-miss-shetty-mr-polishetty-movie

Anushka : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతూ బాహుబలి లాంటి తొలి సినిమాలో హీరోయిన్గా నటించి అందరి మన్ననలు పొందిన అనుష్క అంటే సినీ అభిమానులు అందరికీ ఎంతో ఇష్టం. ఆమె కెరీర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఆమె చేసిన ప్రతి పాత్రకు ఎలా న్యాయం చేయాలి? ఆ పాత్రలో ( Anushka revealed a video ) ఎలా ఇమిడిపోవాలి అనే తపనతోనే పనిచేసే మనిషి. అందుకే అనుష్క అంటే అంత క్రేజ్. బాహుబలి సినిమాతో ఆమె ఖ్యాతి ఎక్కడకో వెళ్ళిపోయింది. కానీ దురదృష్టం ఏమిటంటే.. బాహుబలి సినిమా తర్వాత ఆమె సరైన సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ సినిమాలు తగలలేదు.

Anushka - shetty

సైజ్ జీరో సినిమా కోసం ఆమె వెయిట్ పెంచుకున్న విషయం మనందరికీ తెలిసిందే.కేవలం ఒక పాత్రకు న్యాయం చేయడం కోసం ఆమెకు ఆమె అన్యాయం చేసుకుంది అని ఎందరో కామెంట్లు కూడా చేశారు. ఎందుకంటే.. అక్కడ నుంచి అనుష్క ( Anushka revealed a video ) కెరీర్ కి చాలా పెద్ద దెబ్బ కొట్టింది.ఒక్కసారిగా ఆమె బరువు పెరగడం, ఆమె ముఖంలో, శరీరంలో అనేక మార్పులు రావడం వలన.. ఆమెను తర్వాత సినిమాల్లోకి తీసుకోవడానికి అందరూ భయపడుతూనే వచ్చారు. ఇప్పటికీ ఆమె ముఖంలో చేంజ్ ఎంతో వచ్చేసిందని.. దానికి కారణం ఆ సినిమాలో ఆమె అలా నటించడం వల్లనే అని ఇప్పటికే అనుకుంటూ ఉంటారు.

See also  RRR OSCAR SPECIAL: నాటు నాటు పాటకు రాహుల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..??

Anushka-movie

అయితే అనుష్క సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తోనే రివ్యూస్ వచ్చాయి. ఈ సినిమాపై అందరూ పాజిటివ్ గానే స్పందించారు కానీ దురదృష్టం ఏమిటంటే.. ఈ సినిమాకి పోటీగా జవాన్ వచ్చి పడింది. అదే రోజు రిలీజ్ అయిన జవాన్ కూడా మంచి టాక్ వచ్చింది. షారుక్ ఖాన్ హీరో అవడం హై బడ్జెట్ సినిమా అవడం వలన ఈ సినిమాకి క్రేజ్ చాలా ఎక్కువగా ( Anushka revealed a video ) వినిపించింది. అనుష్క సినిమా సైలెంట్ గా ఉన్నా కూడా దానికి రావాల్సిన కలెక్షన్ సంపాదించుకొని చక్కగా సక్సెస్ అయింది. అయితే ఈ సినిమా సక్సెస్ అయినందుకు అనుష్క అభిమానులు ఎంతో ఆనంద పడుతున్నారు. అయితే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రిలీజ్ కి ముందు ఈవెంట్స్ లో గాని, ప్రమోషన్ లో గాని ఎక్కడ అనుష్క కనిపించలేదు. ఆమె కేవలం తన వాయిస్ మాత్రమే వినిపించింది.. లైవ్ లో ఎవరికీ కనిపించలేదు.

See also  Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య ప్రేమ విడిపోవడానికి షణ్ముఖ్ జస్వంత్ కారణమా?

Anushka-Naveen-Polishetty

దీంతో అనుష్క అలానే జీరో లాగే లావుగా ఉండి ఉంటుంది, అందుకే షేమ్ ఫీల్ అయి బయటికి రావడం లేదు అని అనుకున్నారు. అయితే ఆమె ఇప్పుడు ఒక వీడియోలో ఆమె మాట్లాడుతూ.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాని సక్సెస్ఫుల్ చేసినందుకు అభిమానులందరికీ ధన్యవాదాలు చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. దీనితో ఇందులో అనుష్క ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు అనుకున్నట్టుగా ఆమె సైజ్ జీరో లెవెల్ లో అంత లావుగా గాని, ముఖం అంతా పాడై గాని ఏమీ లేదు. సన్నగా, చక్కగా బాగానే ఉంది. దీనితో అనుష్క పై ఇంతకాలం ఉన్న అపోహలన్నీ పోయాయని.. అసలు విషయం బయటపడిందని అందరూ అనుకున్నారు. అయితే ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ అనుష్క ఏం తీసుకోబోతుంది? ఈసారి ఆమె కచ్చితంగా పాన్ ఇండియా సినిమాల్లో నటించాలని.. ఆమెకి మంచి మంచి ప్రాజెక్ట్స్ దొరకాలని.. ఆమె నటన ట్యాలెంట్ ని ఇంకా సినిమా రంగం ఉపయోగించుకుంటూ.. అభిమానులకి చూపించాలని అందరూ కోరుకుంటున్నారు.