Anushka : అనుష్క హీరోయిన్ గా, నవీన్ పోలిశెట్టి హీరోగా, పి. మహేష్ బాబు దర్శకత్వంలో వినూత్నమైన కథతో రూపొందిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక వినూత్నమైన కథతో రూపొందిన ఈ చిత్రం ( Anushka and Pan India movie ) ప్రేక్షక ఆదరణ పొందుతుందా లేదా అని అందరికీ అనుమానమే. ఎందుకంటే అనుష్క ఎంతటి స్టార్ హీరోయిన్ మనందరికీ తెలుసు. బాహుబలి, బాహుబలి 2 లాంటి పాన్ ఇండియా సినిమాల్లో స్టార్ హీరోయిన్గా నటించి.. ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న ఈమె ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ లో నటించడం కరెక్టేనా అని ఎందరో అనుకున్నారు.
పైగా ఈ సినిమాలో హీరో నవీన్ పోలిశెట్టి అనుష్క కంటే వయసులో చిన్నవాడు. తనకంటే చిన్న వాడితో ఈ సినిమాలో నటించి అందరిని మెప్పించగలదా? ఈ జంట అందరికీ నచ్చుతుందా? అని ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికీ అర్థమైంది ఏమిటంటే.. వినూత్నమైన కథ తో ఈ సినిమాని ( Anushka and Pan India movie ) రూపొందించడమే కాకుండా.. ఈ సినిమాలో ముఖ్యంగా ఆడియన్స్ కు అవసరమైన కామెడీ తో పాటు, సెంటిమెంట్ ని కూడా జత కలిపి ఎంతో చక్కగా రూపొందించాడు దర్శకుడు. కథను బట్టి సినిమా కొంత స్లోగా అక్కడక్కడ అనిపించింది కానీ.. టోటల్ గా చూసుకుంటే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.
అయితే సాధారణంగా ఎవరైనా కూడా ఒక పాన్ ఇండియా సినిమా చేసాము అంటే ఆ తర్వాత కూడా అలాంటి సినిమాలే చేయాలని, ఆ స్థాయిలోనే ఉండాలని కోరుకోవడం చాలా సహజం. కానీ అనుష్క మాత్రం బాహుబలి 2 తర్వాత ఆమె ఎలాంటి పాన్ ఇండియా సినిమాని ఒప్పుకోలేదు. భాగమతి సినిమా చేసింది ఆ తర్వాత ఓటీటీ లో రిలీజ్ ( Anushka and Pan India movie ) అయిన నిశ్శబ్దం సినిమా చేసింది. ఆ తర్వాత ఇప్పుడు వినూత్నమైన కథతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మన ముందుకు వచ్చింది. అయితే ఆమె అభిమానులందరిలో ఎప్పటినుంచో ఉన్న అనుమానం ఏమిటంటే.. ఆమె ఎందుకు పాన్ ఇండియా సినిమాలు ఒప్పుకోలేదని.. ఇన్నాళ్లకు అనుష్క దానికి కారణం చెప్పేందుకు నోరు తెరిచింది. అసలు అనుష్క సినిమాలు ఎందుకు ఒప్పుకోలేదో అసలు కారణం తెలుసుకుందాం.
అనుష్క ని పాన్ ఇండియా సినిమాలు మీరు ఎందుకు ఒప్పుకోవడం లేదు అని అడగగా.. ఆమె సమాధానం చెప్పుకొచ్చింది. బాహుబలి 2 సినిమా తర్వాత.. నాకు వచ్చిన ఆఫర్ భాగమతి సినిమా. ఆ సినిమా చేసి నా తర్వాత నాకు కొంత రెస్ట్ కావాలనిపించింది. విపరీతమైన స్ట్రెస్ పడలేకపోయాను. పాన్ ఇండియా సినిమా ఒప్పుకుంటే విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. అందుకని కొంతకాలం గ్యాప్ తీసుకుంటేనే మళ్ళీ రిఫ్రెష్ అయ్యి.. మంచి సినిమాలో చేయగలమని అనుకున్నాను. అందుకే కొంత రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. అలా నేను కొంత రెస్ట్ తీసుకుని మళ్ళీ ఉత్సాహంతో ముందుకు వచ్చానని చెప్పుకొచ్చింది. ఇకమీదట ఏదైనా మంచి కథ వస్తే.. అది పాన్ ఇండియా కదైనా కూడా వస్తే తప్పకుండా చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది. అలా అనుష్క కొన్ని రోజులు పీస్ ఆఫ్ మైండ్ తో రెస్ట్ తీసుకోవడం కోసమే పాన్ ఇండియా సినిమాలను దూరంగా పెట్టిందన్నమాట.