Anupama : అనుపమ పరమేశ్వరన్ మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ ఆ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయిన ( Anupama Parameswaran marriage ) అనుపమ పరమేశ్వరన్ అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా తన కళ్ళతో మనుషుల్ని, ఆడియన్స్ ని తన నటనకి ముగ్ధులను చేస్తుంది. అనుపమ పరమేశ్వరన్ మలయాళం అమ్మాయి అయినప్పటికీ ఆమె రూపురేఖలు అన్నీ కూడా అచ్చం తెలుగమ్మాయిలాగే ఉంటుంది. అందుకే తెలుగు ఆడియన్స్ అందరికీ ఆమె అంటే చాలా ఇష్టం. కేవలం సినిమా ఆడియన్స్ కు మాత్రమే కాకుండా హీరోలకు సైతం ఆమె అంటే చాలా క్రేజ్ ఉందని అంటారు.
ఇటీవల కాలంలో అనుపమ పరమేశ్వరన్ వరుసగా హిట్స్ కొట్టి హ్యాట్రిక్ సాధించింది. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆమెతో మాట్లాడుతూ.. ఆమె పెళ్లి గురించి ప్రశ్నించడం జరిగింది. మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్డ్ మ్యారేజ్ ( Anupama Parameswaran marriage ) చేసుకుంటారా అని అడిగింది. హోస్ట్ అడిగిన ప్రశ్నకి అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. అసలు ఆరంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను అని మీరు ఎలా అనుకున్నారు. నేను కచ్చితంగా లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటాను. ఆరంజ్డ్ మ్యారేజ్ అసలు చేసుకోను అని చెప్పింది. ఇంత గట్టిగా లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటాను అని బయటపెట్టింది అంటే.. కచ్చితంగా ఎవరినైనా ప్రేమించి ఉంటుందా అని అందరిలో ఇప్పుడు అనుమానం మొదలైంది.
ఇప్పటికే చాలాసార్లు అనుపమ లవ్ మీద పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం అనేది జరిగింది కానీ.. ఆమె కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటారని ఇంతవరకు మనసులో మాటని ఎప్పుడు బయట పెట్టలేదు. ఇప్పుడైతే బయట పెట్టేసింది. నేను కచ్చితంగా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని మీరు ఎలా ( Anupama Parameswaran marriage ) అనుకున్నారు అని అంత గట్టిగా ప్రశ్నించింది అంటే ఆమెకి లవ్ అంటే అంత ఇష్టమని ఇప్పుడు అర్థమవుతుంది. ఇక ఆమె అభిమానులైతే లవ్ మ్యారేజ్ కి అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ ని చూసి ఇంకా హుషారుగా ఉన్నారు. ఇప్పటికే ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.. అన్ని వయసుల వారు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.
అలాంటిది అనుపమ లాంటి క్రేజీ హీరోయిన్ ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇక అభిమానులకు అయితే ఒక కిక్ లాగే ఉంది. అయితే నెటిజనులు మాత్రం అనుపమ ఎవరిని ప్రేమించి ఉంటుంది కచ్చితంగా ఎవరితోనో ప్రేమలోనే ఉంది లేకపోతే ఇంత స్ట్రాంగ్ గా చెప్పదు. అది సినిమా రంగంలోనే ఎవరినైనా హీరోని ప్రేమించి ఉంటుందా లేదా బయట ఎవరైనా తన ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉండి ఉంటారా అని ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా ఆమె సినిమాలన్నీ ఒకసారి తిరిగేసి ఆలోచిస్తున్నారు. ఎవరితో ఆమె కెమిస్ట్రీ ఎక్కువగా బాగుంది. ఎవరితో ఎక్కువగా క్లోజ్ గా నటించింది.. ఏ హీరో అయి ఉంటాడు అని తెగ వెతికేస్తున్నారు. పోనీలెండి ఇలాగైనా అనుపమ సినిమాల్ని ఒకసారి తిరగేసి బాగా చూస్తున్నారు అని కొందరు అనుకుంటున్నారు..