Home Cinema Animal Review Talk : అనిమల్ యుఎస్ఏ రివ్యూ ఎలా ఉందంటే..

Animal Review Talk : అనిమల్ యుఎస్ఏ రివ్యూ ఎలా ఉందంటే..

animal-movie-review-talk-released-from-usa

Animal Review Talk : రేపు డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచవ్యాప్తంగా అనిమల్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక కొన్ని గంటల్లోనే అందరిలోని ఎంతో క్రేజ్ ని, ఆత్రుతని పెంచిన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆత్రం కూడా అందరిలో ఉంది. చాలామందిలో కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫీలింగ్ ఉంటే.. ఎక్కడో ఒకచోట ఏమో ఇంత మంది అంచనాలను అందుకుంటుందా అనే మరో రకమైన ఫీలింగ్ కూడా ఉండకపోలేదు. అయితే ఈ సినిమా రివ్యూ లు రేపు సినిమా ( Animal Movie Review Talk ) హాల్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత వస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో యూఎస్ఏ రివ్యూ అంటూ కొన్ని రివ్యూస్ వస్తున్నాయి. యుఎస్ఏ లో ముందు రోజుగా సినిమా ప్రివ్యూస్ వేస్తారని.. దానికి సంబంధించిన టాక్ రివ్యూ టాక్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం..

See also  Sai Dharam Tej Reacts: నేను అబ్దుల్ కి డబ్బులు ఇవ్వలేదు..అబ్దుల్ వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్..

Animal-Ranbhir-movie-usa-review-talk

రణ్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో, అనిల్ కపూర్, సన్నిడియోల్ ముఖ్యపాత్రలో ( Animal Movie Review Talk ) నటించిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూ టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రొమాన్స్ , వైలెన్స్, ఎమోషన్ మూడు కూడా హై లెవెల్ లోనే చూపించారని, మనం ఇప్పటివరకు చూసిందాని కంటే నెక్స్ట్ లెవెల్ లో ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా ఒక రివెంజ్ డ్రామా అని అంటున్నారు. తన తండ్రిని చంపిన వాళ్ల మీద రివేంజ్ తీసుకునే డ్రామా ఉంటుందని అంటున్నారు.

Animal-movie-usa-review-talk-anilkapoor

ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. అలాగే తండ్రి కొడుకుల సెంటిమెంటు ఉన్న సినిమా అని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది కానీ.. ఈ సినిమాలో వాళ్ళిద్దరూ సెంటిమెంట్ ని చాలా కొత్తగా చూపించారని రివ్యూ టాక్ వస్తుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలుగా నటించిన రణ్బీర్ కపూర్ ( Animal Movie Review Talk ) మరియు అనిల్ కపూర్ పాత్రలు రెండు కూడా చాలా బాగా నటించారని, అంతేకాకుండా ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ అంటే రన్బీర్ కపూర్ అని అందరూ అంటున్నారు. ఈ సినిమాలో మూడు కోణాల్లో రన్బీర్ కపూర్ నటించాడని.. మూడు కోణాల్లో కూడా, మూడు పాత్రల్లో కూడా అద్భుతంగా జీవించేసాడని అంటున్నారు.

See also  Prabhas - Baby : ప్రభాస్ తో బేబీ కి సూపర్ ఆఫర్..

Animal-movie-usa-review-talk-Ranbhir

యువకుడిగా, భర్తగా, కొడుగ్గా.. మూడు పాత్రలో కూడా రన్బీర్ కపూర్ సూపర్ గా యాక్ట్ చేశాడని అంటున్నారు. ఇందులో రన్బీర్ కపూర్ నటన బ్రిలియంట్ గా ఉందని, అద్భుతమని అంటున్నారు. అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో తన నటన ప్రతిభని మళ్ళీ ఒకసారి చవిచూపించారని అంటున్నారు. ఇక రష్మిక అయితే రన్బీర్ కపూర్ కి జంటగా లవర్ గా, భార్యగా రెండు పాత్రల్లో కూడా ఒదిగిపోయి సూపర్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందని అంటున్నారు. కాకపోతే ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ పేరు తెచ్చుకునేది రన్బీర్ కపూర్ అని.. తన ట్యాలెంట్ మొత్తం దర్శకుడు బాగా లాగి వాడేసాడని.. దీంతో అద్భుతమైన రిజల్ట్ వస్తుందని.. అర్జున్ రెడ్డి సినిమా కంటే కూడా హైలెట్ అవుతుందని అంటున్నారు. మరి ఈ రివ్యూ టాక్స్ అన్ని ఎంతవరకు నిజమనేది రేపు సినిమా హాల్స్ లో మనం చూసిన తర్వాత వచ్చిన రివ్యూస్ ని బట్టి అర్థం చేసుకోవాలి.