Animal movie OTT : ఏ సినిమా అయినా ఆ సినిమా రిలీజ్ అయ్యేవరకు ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఎంత ఆత్రంగా ఉంటుందో.. ఆ సినిమా హాల్లో రిలీజ్ అయిన తర్వాత అది ఓటిటి లోకి ఎప్పుడు వస్తుందని ఆత్రం కూడా అంతే ( Animal movie OTT ) ఉంటుంది. ఎందుకంటే సినిమా ధియేటర్ వరకు వెళ్లడానికి ఖాళీ లేని వాళ్ళు , వెళ్ళలేని వాళ్ళు, అలాగే ఆర్థికంగా అంత బలం లేని వాళ్ళు, ఇలా క్యాలిక్యులేషన్ తో బ్రతికే వాళ్ళు, ఇలా ఎందరో ఉంటారు. అందరికీ చాలా అందుబాటులో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత ఎంతసేపు చూడాలంటే అంతసేపే చూసి కంటిన్యూ చేసే ఫెసిలిటీ వచ్చిన రోజుటివి. అందుకే ఓటిటి ప్లాట్ఫామ్ అంటే అందరికీ అంత ఇష్టం.
సినిమా రిలీజ్ కి ముందే ఎంతో క్రియేషన్ సంపాదించుకున్న సినిమా అనిమల్. ఈ సినిమా కోసం సినీ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. ఈరోజు అనిమల్ సినిమా రిలీజ్ అయ్యి.. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యే అందరిని ( Animal movie OTT ) ఆహ్లాద పరుస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్లంతా కూడా చాలా అద్భుతంగా ఉందని కొందరు అంటే.. మరికొందరు చాలా బోల్డ్ గా , వైలెన్స్ గా , మరి దారుణంగా ఉందని ఇంకొందరు అనగా.. అటు ఇటుగా మొత్తానికి మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది. ఈ సినిమా ఫస్ట్ అఫ్ ఒకలా ఉంటే, సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ అయిందని డైలీ సీరియల్ గుర్తుకొచ్చిందని మరికొందరంటున్నారు.
రణ్బీర్ కపూర్ మాత్రం తన నటనా ప్రతిభని చాలా అద్భుతంగా ఈ సినిమాలో చూపించాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే రన్బీర్ కపూర్ కి ఒక మంచి పేరు ఉంది. ఏ పాత్రలోనైనా తలకాయ ప్రవేశం చేసి మరి అద్భుతంగా నటిస్తాడని పేరు ఉంది. అలాంటిది ఈ పాత్రలో మరింత బాగా నటించాడని అంటున్నారు.సందీప్ రెడ్డి వంగ ( Animal movie OTT ) రన్బీర్ కపూర్ తో భయంకరమైన వైలెన్స్ అండ్ రొమాన్స్ అన్నిటిని కూడా చేయించాడని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో అనిల్ కపూర్ కూడా తన నటనా ప్రతిభని, అనుభవాన్ని ఎక్కడికి పోనివ్వకుండా ఎంతో చక్కగా నటించాడని పేరు వచ్చింది. ఏదేమైనా సెంటిమెంట్ సినిమా అయినప్పటికీ కూడా.. కుటుంబ సభ్యులతో కలిసి చూసే విధంగా లేదని కొందరు అంటున్నారు.
మరి వైలెన్స్, మరీ బోల్డ్ సన్నివేశాల వలన కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని సినిమా చూడాలంటే కష్టమే అంటున్నారు. అలాంటి క్రమంలో ఈ సినిమానే మిక్స్డ్ టాక్ గా తీసుకున్నారు. ఇక కలెక్షన్ల పరంగా ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఏదేమైనా వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ అదిరిపోతాయి. ఆ తర్వాత కూడా కలెక్షన్స్ విషయంలో ఏ లోటు ఉండదని కచ్చితంగా సినిమా సక్సెస్ అయిపోయి నడుస్తుందని చాలామంది అభిప్రాయం. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటిటి లోకి ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూసే ప్రేక్షకులకి అప్పుడే ఓటీటీ కబురు కూడా బయటకు వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సంస్థ తీసుకుందట. సినిమా హాల్స్ లో రిలీజ్ అయిన 6 నుండి 8 వారాల తర్వాత ఈ సినిమాను ఓటిటిలో వచ్చేలాగా డీల్ మాట్లాడుకుందట. అంటే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ సంక్రాంతికి గానీ లేదా రిపబ్లిక్ డే లోగాని అనిమల్ సినిమా ఓటిటిలోకి రావడానికి అవకాశం ఉందన్నమాట..