Animal movie : రన్బీర్ కపూర్ హీరోగా, రష్మిక హీరోయిన్గా, త్రిప్తి దిమ్రి, బాబీ డియోల్, అనిల్ కపూర్ ఇలా తదితరులు నటించగా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అనిమల్ సినిమా ( Animal movie hero Ranbir Kapoor comments )ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇలాంటి సినిమా తీయాలంటే దర్శకుడికి చాలా ధైర్యం కావాలని, అలాంటి సినిమాలు ఒప్పుకొని అందులో నటించాలంటే హీరో-హీరోయిన్స్ కి ఇంకా ధైర్యం కావాలని ఎందరో ఎన్నో కామెంట్స్ చేశారు. ఈ సినిమా కలెక్షన్ ల వర్షం ఎంత గొప్పగా కురిపించిందో మనందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమా సక్సెస్ ని ఎంతో చక్కగా ఆస్వాదించారు. ఎందుకంటే.. అనిమల్ సినిమా సక్సెస్ అనేవి మామూలుగా జరగలేదు. చిన్నపిల్లాడి నుంచి పెద్దల వరకు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూనే వచ్చారు. మాట్లాడే మాటల్లో ఆ సినిమాపై పాజిటివ్గా అవొచ్చు లేదా నెగటివ్గా కావచ్చు.. ఎలా అయినా ( Animal movie hero Ranbir Kapoor comments ) కూడా ఆ సినిమా సినీ అభిమానులు అందరూ కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సందీప్ రెడ్డి వంగ గొప్ప సక్సెస్ ని తన జాబితాలో మరొకటి వేసుకోవడం జరిగింది. అయితే ఈ సినిమాలో హీరో రన్బీర్ కపూర్ ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు.
ఆ కామెంట్స్ చూసి సినీ అభిమానులు అందరూ ఆశ్చర్యపోయారు. రన్బీర్ కపూర్ ఇకపై అనిమల్ లాంటి సినిమాలో నటించబోను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. యానిమల్ సినిమాపై వస్తున్న విమర్శలపై ఆయన మొదటిసారిగా నోరు విప్పి మాట్లాడారు. పరిశ్రమకు చెందిన కొంతమందిని పలు సందర్భాల్లో నేను కలిశాను. వాళ్లంతా కూడా అనిమల్ లాంటి సినిమాను నువ్వు చేసి ఉండకూడదు అని అన్నారు. నన్ను ఆ పాత్రలో చూసి చాలా డిజప్పాయింట్ అయ్యామని కూడా చెప్పారు. వాళ్లందరికీ ( Animal movie hero Ranbir Kapoor comments ) నేను క్షమాపణలు చెప్పాను. మరోసారి అలాంటి సినిమా చేయనని కూడా చెప్పాను అని రన్బీర్ కపూర్ చెప్పాడు. అయితే కేవలం వాళ్లకు క్షమాపణ చెప్పాను మాత్రమే హామీ ఇవ్వలేదు అంటూ మళ్లీ మాట మార్చాడు.
ఇప్పుడు నేను ఉన్న స్టేజిలో వాళ్లతో వాదించడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే క్షమాపణ చెప్పేసి అక్కడ నుంచి వచ్చేసానని చెప్పాడు. నిజానికి అనిమల్ లాంటి సినిమా అవకాశం మళ్ళీ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పుకొచ్చాడు రన్బీర్. మంచివాడిగా, ప్రియుడుగా ఎన్నో పాత్రలు నటించాను కానీ ఇలాంటి పాత్ర నటిస్తేనే కదా నాకు కెరీర్లో ఒక బిగ్ సక్సెస్ ని నా ఖాతాలో వేసుకోకలిగాను అని రన్బీర్ చెప్పడం జరిగింది. కెరీర్ లో నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలి అంటే ఇలాంటి పాత్రలను అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా నటించాలని చెప్పుకొచ్చారు రన్బీర్. అయితే కనీసం పరిశ్రమలో కొందరి సంతృప్తి కోసమైనా.. రన్బీర్ ఇలాంటి సినిమాను మళ్ళీ చేయను అని క్షమాపణ చెప్పడం అనే మాటలు వింటుంటే.. యానిమల్ సినిమాపై.. అందులో నటించిన హీరో ఇలాంటి మాటలు అనాల్సి వస్తుందని ఎవ్వరూ కూడా ఊహించలేదని.. ఊహించని ఈ మాటలు వినాల్సి వచ్చిందని సినీ అభిమానులు, నేటిజనులు అనుకుంటున్నారు.