Mrunal Thakur: విట్టిదండు అనే మరాఠీ సినిమాతో వెండితెర పై మొదటిసారి కనిపించింది మృణాల్ థాకూర్. ఆ తర్వాత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో దూసుకుపోయింది. బాలీవుడ్ లో సినిమాలు చేసినప్పటికీ సరైన హిట్టు దొరకలేదు. అదే సమయంలో మలయాళ స్టార్ తెలుగులో రెండవ చిత్రం డైరెక్ట్ చేసిన దుల్కర్ సల్మాన్ మూవీ సీతారామంతో మృణాల్ థాకూర్ జీవితం టర్నింగ్ పాయింట్ గా మారిందని చెప్పాల్సిందే.
హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీతామాలక్ష్మి పాత్రలో మృణాల్ థాకూర్ అదరగొట్టింది. దాంతో తెలుగులో తొలి సినిమాతోనే మృణాల్ చిత్ర పరిశ్రమలో రాత్రికి రాత్రి స్టార్ గా గుర్తింపు పొందింది. ఇక ప్రస్తుతం చేతిలో తెలుగుతో పాటు హిందీ చిత్రాలతో బిజీ బిజీ గా గడుపుతుంది. సోషల్ మీడియా ఫాలోయింగ్ కొందరికి కలిసి వస్తే కొందరికి కలిసి రాదని చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా ఎంత పాపులర్ అవుతామో అంతకంటే ఎక్కువగా ట్రోల్స్ కి గురవుతాము.
అలా అనుకోకుండా కొన్నిసార్లు జరిగే పొరపాట్ల వల్ల ట్రోలింగ్ కు గురవుతుంటారు. అలాగే మృణాల్ విషయంలో ఇలాంటిదే జరిగింది. ఇంతకు జరిగిందేంటంటే.. ఆ మధ్యలో ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త గురించి మాట్లాడింది. అందం ముఖ్యం కాదని తెలిపింది. దాని తర్వాత కపిల్ శర్మ షో లో కాబోయే భర్త అందంగా ఉండాలని తెలిపింది.ఈ విషయాన్ని పట్టుకుని మృణాల్ ను తట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు..
ఇలా తనకు కాబోయే భర్త విషయంలో రెండు వేర్వేరు వ్యాఖ్యలు చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కపటత్వానికి అర్ధాన్ని మార్చారు కపటత్వం అంటే మృణాల్ అని మేమ్ క్రియేట్ చేసి మరీ ట్రోల్ చేశారు. దీంతో మృణాల్ ఆగ్రహించింది. తనపై ట్రోల్ చేస్తూ మీమ్ చేసిన వారికి మృణాల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. నేను అప్పుడు అలా ఫీల్ అయ్యాను ఇప్పుడు ఇలా ఫీల్ అవుతున్నాను అనే అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాను మేము కూడా మనుషులని ఎందుకు మర్చిపోతున్నారు.. దాంతో ట్రోలింగ్ విషయంలో పలువురు నెటిజెన్స్ మృణాల్ కు తోడుగా నిలుస్తున్నారు.