Anchor Suma: యాంకర్ సుమ కనకాల గురించి మనందరికీ తెలిసిన విషయమే.. తన మాటల గారడితో అందరిని ఇట్టే మాయ చేసి పడేస్తుంది. ఆమెతో పోటీపడి మాట్లాడాలని ప్రయత్నిస్తే వాళ్లు అవుట్ అనే చెప్పాలి అలాంటి మాటల మంత్రగత్తే సుమ కనకాల. ఇక మన టాపిక్ విషయానికి వస్తే.. ఏంటి యాంకర్ సుమ కనకాల ఆ తప్పు చేసి కటకటాల పాలయిందా. దీంతో ఆమె అభిమానులందరే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా కంగారు పడుతున్నారు. దీని అంతటికి ప్రధానమైన కారణం ఆమె చేతికి ఉన్న సంకెళ్లు..
అవును ఆమె చేతికి బేడీలు ఉన్న ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొట్టడంతో ఆ ఫోటో చూసిన ఎందరో నెటిజన్లు సుమను ఎందుకు అరెస్ట్ చేశారని నానా రకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటు బుల్లితెర అయినా అటు వెండితెర అయినా ఎలాంటి తేడా లేకుండా అక్కడ సుమ (Anchor Suma) ఉండాల్సిందే. మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు భాషని ఆవుపాసన పట్టి గలగల మాట్లాడేస్తుంది. అందుకే స్టార్ హీరోలు సైతం ఆమె మాట్లాడే మాటలకు ఆశ్చర్యపోతుంటారు. సినీ పరిశ్రమలో ఎందరో లేడీ యాంకర్లు ఉన్న అందరూ ఇష్టపడేది మాత్రం సుమా యాంకరింగ్ నే..
సుమ ఒక్క యాంకరింగ్ కాకుండా సినిమాల్లో కూడా నటించింది. కానీ అవి అంతగా కలిసి రాకపోవడం చేత సినిమాలు చేయనని తాను ఇదివరకే ప్రకటించింది. మరి ఇది ఇలా ఉంటే తాజాగా సుమ చేతికి బేడీలు ఉండి ఓ వాహనంలో వెళ్తున్న ఫోటో నెట్టింట చెక్కర్లు కొడుతుంది. ఇక ఈ ఫోటో చూసిన చాలామంది నెటిజెన్స్ సుమ ఎందుకు అరెస్ట్ అయింది.? అని తెలుసుకునే ప్రయత్నంలో తెగ కామెంట్లు పెడుతున్నారు. మరి అసలు విషయం ఏంటో తెలుసా.. అదేనండి అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం కస్టడి.
అవును మీరు విన్నది నిజమే.. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసమే సుమ కనకాల ఇలా వెరైటీగా ప్రమోషన్ చేస్తుందని నెట్టింట ఓ టాక్ మనకు వినిపిస్తుంది. ఇప్పటికే అక్కినేని నాగచైతన్య రాబోయే చిత్రం కస్టడీ ప్రమోషన్స్ కోసం ఈ చిత్ర డైరెక్టర్ వెంకట్ ప్రభు ని కూడా జైల్లో వేసి విచారిస్తున్నట్లుగా ఉండే వీడియో మూవీ యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసి కస్టర్డ్ చిత్రంపై హైప్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం జరిగింది. మరదే విధంగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగానే యాంకర్ సుమని కూడా అరెస్టయినట్టు ఫోటో నెట్టింట్లో పోస్ట్ చేయగా అది పెద్ద దుమారమే లేపుతుంది.