Anchor Rashmi Is Going To Get Married: తెలుగులో ఎంతగానో అలరిస్తున్న బుల్లితెర షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే యాంకర్లు కూడా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. అందులో ముఖ్యంగా యాంకర్ అనసూయ జబర్దస్త్ ద్వారా ఎంతో పెద్ద గుర్తింపు సంపాదించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. యాంకర్ అనసూయ అంతకుముందే సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ఆమె మాత్రం జబర్దస్త్ ద్వారానే చాలా మంచి గుర్తింపు తెచ్చుకుందని పక్కాగా చెప్పొచ్చు. ఇదే విధంగా రష్మి కూడా గతంలో సినిమాల్లో చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పటికీ జబర్దస్త్ ద్వారానే స్టార్ యాంకర్ గా ఎదిగింది.హీరోయిన్లలో తగలదన్నే ఫాలోయింగ్ సోషల్ మీడియాలో దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.
అలాంటి రష్మి గౌతమ్ జబర్దస్త్ లో స్టార్ యాంకర్ గా మారిన తర్వాత సినిమాలలో హీరోయిన్గా కూడా అవకాశాలు అందాయి. ఒక్క బుల్లితెర పైన అల్లరి చేస్తున్న రష్మీ సుధీర్ ల జోడి కి ఓ రేంజ్ లో గుర్తింపు వచ్చింది. వెండితెరలో ప్రభాస్ అనుష్కల జంటలకు ఎంత మంచి గుర్తింపు అయితే ఉందో.. అలాంటి గుర్తింపు బుల్లితెర పైన దక్కింది మాత్రం సుధీర్ రష్మీ ల జోడి కి మాత్రమే అని చెప్పాలి. ఇదేకాక చాలామంది వీళ్ళిద్దరి వీరాభిమానులు ఓవైపు రష్మీ మరోవైపు సుధీర్ నిజంగా వీళ్ళిద్దరి పెళ్లి చేసుకుంటే బాగుండనే కోరుకుంటున్నాను. ఇది ఒక ఎత్తైతే ఇప్పటికే మల్లెమాల ప్రొడక్షన్స్ ఎన్నోసార్లు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు చాలా ప్రోగ్రామ్స్ లో సుధీర్ రశ్మిల పెళ్లి నిజంగా జరిగిందన్నట్లుగా చాలా ప్రోగ్రాంలో నిర్వహించారు. ఆ ప్రోగ్రాం లో చూస్తుంటే నిజంగా పెళ్లి కంటే చాలా రేట్లు మల్లెమాల వాళ్లు నిర్వహించిన పెళ్లి చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇక ఈ విషయాలు పక్కకు పెడితే తాజాగా రష్మి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో కూడా వస్తుంది. అది ఏంటి అనుకుంటున్నారా రష్మీ రెండో వాడిని (Anchor Rashmi Is Going To Get Married) పెళ్లి చేసుకోబోతుందంటూ ఒక వార్త తెగ వైరల్ గా మారింది.. అయితే ఈ వార్త నిజమే అని నమ్మారు అనుకో మీరు నిజంగానే పప్పులో కాలేసినట్టే.. ఎందుకో తెలుసా. అదేంటంటే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో రష్మీ పెళ్లికూతురుగా కనిపించింది. స్వయంవరం కూడా ఏర్పాటు చేశారు.
ఈ స్వయంమరానికి చాలామంది బుల్లితెర సెలబ్రిటీలు వచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి చెక్కర్లు కొడుతుంది. అయితే కొంతమంది నేటిజన్స్ మాత్రం రష్మి నిజంగానే పెళ్లి చేసుకోబోతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. అసలు విషయం అసలు విషయం తెలిశాక ఇది షో కోసం చేశారా అంటూ మళ్ళీ కామెంట్లు పెడుతున్నారు. ఇక రష్మీకి ఇప్పటికే పెళ్లయిపోయింది అని గతంలో ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఇంకా ఆ విషయం పై క్లారిటీ రాలేదు.