Anchor Anasuya: జబర్దస్త్ యాంకర్ అనసూయ బుల్లి తెరకు బాయ్ బాయ్ చెప్పి వెండి తెరపై తళుక్కుమంటున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ కు రంగమ్మత్తగా అనసూయ నటించి అదరగొట్టి అనే చెప్పాలి. ఆ తర్వాత చావు కబురు చల్లగా అనే చిత్రంలో ఐటెం సాంగ్ కూడా చేసింది. ఇదే కాకుండా ఆచితూచి అడుగేస్తూ ఎంపిక చేసుకునే పాత్రలో అదరగొడుతుందనే చెప్పాలి. ప్రస్తుతం అనసూయ నటిస్తున్న చిత్రం రాజా కార్..
ఇందులో సీరియస్ రోల్లో మన ముందుకు రాబోతుంది. అయితే అందులో భాగంగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. స్పెషల్ సాంగ్ ఇప్పుడు కూడా చేస్తాను. రజాకార్ మూవీలో పాత్రకు నేను కనెక్ట్ అయి ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇది నిజంగా జరిగిన చరిత్ర కావడంతో ఆసక్తి రెట్టింపు అయింది. నాకోసం ఎలాంటి పాత్ర రాసిన చేస్తాను. నేను అన్ని రకాల పాత్రలు గ్లామర్ రోల్స్ చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నానంటూ అనసూయ (Anchor Anasuya Ready) వెల్లడించింది.
ఇక ఇదే కాకుండా అనసూయ (Anchor Anasuya Ready) పలు షాపింగ్ మాల్స్ ఓపెన్ కి వెళ్తూ రెండు వైపులా చేతినిండా డబ్బులు అయితే సంపాదిస్తుంది. ఇక ఇదే కాకుండా సోషల్ మీడియాలో నిత్యం చాలా చురుగ్గా ఉంటూ ఆమె అభిమానులకు చాలా చేరువుగా ఉంటుంది. ఇవే కాకుండా తన ఘటైన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ట్రోలింగ్ సైతం ఎదుర్కొంటుంది. వాటన్నిటిని గట్టిగా తన దైన శైలిలో ఎప్పుడూ తిప్పికొడుతూ సమాధానం ఇస్తూనే ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందంటే క్షణాల్లో వైరల్ అవ్వడం ఖాయం.