Home Cinema Anasuya: నాకు ముందే తెలుసు నేను నీకు సరియైన భార్యను కాదని కానీ అంటూ –...

Anasuya: నాకు ముందే తెలుసు నేను నీకు సరియైన భార్యను కాదని కానీ అంటూ – అనసూయ.

Anasuya: ఒకప్పుడు న్యూస్ రీడర్ గా తన సినీ జీవితాన్ని మొదలు పెట్టిన అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మారి నెంబర్ వన్ స్థానంలో నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతూ.. ఆ తర్వాత యాంకరింగ్ కి దూరమై ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీ బిజీగా ఇక మనందరికీ తెలిసిన విషయమే. అనసూయ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటుందో మనం నిత్యం ఆమె మెసేజ్ చేసుకునే అప్డేట్స్ విషయాలతో మనం చూస్తూనే ఉంటాం.. కేవలం ఆమె తనకు సంబంధించిన ఫోటోలను మాత్రమే కాకుండా తన అభిమానులతో ఎలాంటి విషయాన్నైనా సరే ఇట్టే షేర్ చేసుకుని మరి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటుంది.. (Anasuya Says)

See also  Chiranjeevi : పవన్ మహేష్ బాబులను పిలిచి చిరంజీవి ఆ విషయం చెబితే వాళ్ళమేన్నారంటే..

anasuya-says-i-know-i-am-not-a-perfect-wife-for-you

ఇక నిన్న అనసూయ సుశాంత్ భరద్వాజుల పెళ్లి రోజు. దాంతో ఈ పెళ్లి రోజు సందర్భంగా భర్తకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఇంస్టాగ్రామ్ వేదికగా చాలా ఓపెన్ గా మెసేజ్ పెట్టారు. అదేంటంటే తనకు తన భర్త రాసిన తొలి ప్రేమ లేఖ కు అనసూయ భరద్వాజ్ అప్పట్లో సమాధానం చెప్పలేక పోయినప్పటికీ.. ఇప్పుడు దానికి సమాధానంగా ఈ ఇమేజ్ పెడుతున్నానంటూ పోస్ట్ షేర్ చేస్తూ దానికి సంబంధించిన విషయాన్నీ అనసూయ తెలియజేశారు. ప్రియమైన నిక్కూ.. ఇన్ని రోజులు నాతో కలిసి ఉండటమే కాకుండా నా కోసం ఎన్నో త్యాగాలు చేశావు.. (Anasuya Says)

See also  Allu Arjun : వెయ్యి మందితో ఒకేసారి అలా చేసిన అల్లు అర్జున్.. చూడలేక షూటింగ్ ఆపేసిన సుకుమార్..

anasuya-says-i-know-i-am-not-a-perfect-wife-for-you

ఎందరో నీ పై ఎంతో నీచమైన కామెంట్లు చేసినప్పటికీ.. వాటిని మీరు అస్సలు పట్టించుకోలేదు. మన ప్రేమ మందిరాన్ని నువ్వు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది నిలబెట్టావు. అందుకు నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.. నన్ను ఎంతో ఉత్సాహంగా ఉండేలా నిరంతరం చూసుకుంటూనే ఉన్నారు. ఇక మనం ఎంతో తెలివిగా ముందుకు పయనిస్తున్నాము. అదే విధంగా పైకి ఎదుగుతున్నం కూడా.. మీరు నన్ను ప్రేమగా అలాగే ఇంత ఓపిగ్గా ఎలా చూసుకుంటున్నారు అని అప్పుడప్పుడు నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. ఒక్కోసారి నేను కూడా కొన్ని విషయాల్లో నిన్ను వెనకేసుకు వస్తూనే ఉన్నాను.

See also  Lavanya Tripathi : వామ్మో పెళ్ళికి ముందే.. లావణ్య ప్రగ్నెంట్ అని అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారట నిజమేనా?

anasuya-says-i-know-i-am-not-a-perfect-wife-for-you

మనిద్దరం ఒకరిని ఒకరం అర్థం చేసుకుంటూ ఉంటాం.. కానీ చాలా మంది మన జీవితంలో చికాకు పెట్టాలని భావిస్తున్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండానే ముందుకు సాగిపోతున్నాం.. మనిద్దరం పర్ఫెక్ట్ జంట కాదని నాకు తెలుసు.. కానీ కష్ట సుఖాల్లో తోడు ఉంటూ కలిసిపోతున్నాం మన మధ్య ఎన్ని ఆటుపోట్లు ఉన్నా ఒకరికి ఒకరం బలంగా ఉంటూ మరింత ముందుకు సాగుతున్నాము. మనం వివాహ బంధాన్ని డేటింగ్ లాగా ఉండేందుకు అనుమతించినందుకు ధన్యవాదాలు. హ్యాపీ యానివర్సరీ డే ఇప్పటికీ నేను ప్రేమిస్తున్నాను అంటూ అనసూయ భరద్వాజ్ ఈ విషయాలు వెల్లడించారు.