
Anasuya : అనసూయ అనగానే మనందరికీ బాగా తెలిసిన పేరే. జబర్దస్త్ షో తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ.. అంతకుముందు సాక్షి తెలుగు టెలివిజన్ లో న్యూస్ రీడర్ గా పనిచేసేది. ఎప్పుడైతే జబర్దస్త్ షోలో అవకాశం వచ్చిందో అక్కడి నుంచి ఆమె జీవితం మారిపోయింది. జబర్దస్త్ షోలో ఆమెకు ( Anasuya posted her latest story ) పాపులార్టీ బాగా పెరిగిన తర్వాత.. వెండి తెరమీద కూడా ఆమెకు అవకాశాలు వచ్చాయి. సోగ్గాడే చిన్నినాయన.. అక్కినేని నాగార్జున సినిమాలో నాగార్జునతో కలిసి నటించే అవకాశం ఆమెకు వచ్చింది. ఆ తర్వాత ఆమె క్షణం సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రని నటించింది.
అలా నెమ్మదిగా ఆమె సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ ను నటిస్తూ ముందుకు వెళుతుంది. ఇక పాన్ ఇండియా సినిమా అయిన పుష్ప లో కూడా నటించి ఆమె పాన్ ఇండియా సినిమాలో నటించే నటి గా పేరుపొందింది. అలాగే పుష్ప 2 లో కూడా ( Anasuya posted her latest story ) ఈమెకు పాత్ర ఉంది. పుష్ప సినిమాతో అనసూయకి చాలా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు ఏమి కనిపించలేదు. సినిమాల్లో అనసూయ అప్పుడప్పుడు కనిపించినా.. అనసూయ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూసి నెటిజనులు విపరీతంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆమె పాత్రలు బోల్డ్ గా కూడా ఉంటాయి. అలాగే ఆమె పెట్టే ఫోటోలు బోల్డ్ గా ఉన్నా కూడా నెటిజనులు చేస్తూ ( Anasuya posted her latest story ) ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. చదువుకున్న రోజుల్లోనే సుశాంక భరద్వాజను ప్రేమించి.. అలా పది సంవత్సరాల పాటు ఆమె ప్రేమను దాచుకొని.. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇంట్లో వాళ్లకు, పెద్ద వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకోవడం జరిగింది. 2010 సంవత్సరంలో అనసూయకు వివాహం జరిగింది. అనసూయకు ఇద్దరు పిల్లలు. అనసూయ ఎప్పటికప్పుడు తను ఎక్కడికి వెళ్లినా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటు.
అయితే ఇప్పుడు అనసూయ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అది చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక స్టోరీ పోస్ట్ చేసింది అనసూయ. ఆ స్టోరీలో ఏం పెట్టిందంటే.. ” ఎడబాటే నా సమాధానం.. ఇక నేను వాదులాడలేను.. నాటుకీత కూడా ఉండదు.. అలాగే స్పందించడం కూడా జరగదు.. చాలా సింపుల్గా కలవడం మానేస్తాను” అంటూ అనసూయ పోస్ట్ పెట్టింది. అసలు అనసూయ ఇంత గట్టిగా ఎవరికి చెప్తుంది? ఎవరిని వదిలేయాలి అనుకుంటున్నది? ఎవరితో వాదన అంటుంది అనేది ఎవరికి అర్థం కావడం లేదు. బహుశా అనసూయ తన భర్తతో ఏమైనా విడిపోతుందా అని కొందరు అంటుంటే ఏదైనా సినిమాలో డైలాగు ఏమో అని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఆ స్టోరీ వెనకాల ఉన్న కారణమేమిటి అనేది చెప్పగలిగేది అనసూయ ఒక్కర్తే..