Anasuya Is Described As Aunty: మొదట న్యూస్ రీడర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టిన యాంకర్ అనసూయ భరద్వాజ్. ఆ తర్వాత అంచెలు అంచెలుగా ఎదుగుతూ స్టార్ యాంకర్ గా తెలుగు బుల్లి తెర పరిశ్రమలో ఎంతో పేరు సంపాదించిన అనసూయ భరద్వాజ్ యాంకరింగ్ చేయడంలో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉంది. అలాంటి స్టార్ యాంకర్ ఎప్పడూ ఏదో ఒక వివాదంలో కొట్టు మిట్టాడుతూనే ఉంటుంది.. ప్రస్తుతం తాజాగా మరొక వివాదంలో చిక్కుకుంది అనసూయ. అనసూయ ఏ రేంజ్లో సోషల్ మీడియాలో ట్రోల్ గురవుతుందో ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే.
ఐతే అనసూయ ఓ హీరోని టార్గెట్ చేసినప్పటి నుండి ఆమె పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో విపరీతమైన ట్రోల్స్ కి గురి చేస్తున్నారు ఆ హీరో అభిమానులు. మరీ ముఖ్యంగా అనసూయను ఆంటీ ఆంటీ అంటూ లక్షల్లో ట్వీట్లు చేసారు. అలా అనసూయను సోషల్ మీడియాలో ఏడిపించారు. అనసూయ సైతం సోషల్ మీడియాలో లైవ్ పెడితే ఏడిపించిన తీరు జనాలు ఇప్పటికీ మర్చిపోరు ఎవ్వరూ. ఇదేకాక పలుగురు స్టార్స్ కూడా అనసూయను పరోక్షంగా కూడా కామెంట్స్ చేసారు. ఆ మొన్న సుమను స్టేజీపైనే అందరి ముందు బ్రహ్మజీ వెటకారంగా సుమ ఆంటీ అంటూ పిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే.
అయితే అక్కడ పరోక్షంగా అన్నది మాత్రం అనసూయనే అనే విషయం మనందరికీ తెలుసు. ఐతే ఇదే విషయమై, ఇటీవలే అనసూయ ఆంటీ అనే విషయం పట్ల సీనియర్ నటి కస్తూరి స్పందించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది అంకుల్ లు ఉన్నారని.. వాళ్లందర్నీ అంకుల్ అని పిలిస్తేనే అనసూయను కూడా ఆంటీ అని పిలవాలని సీనియర్ నటి కస్తూరి ముఖాముఖి తేల్చి చెప్పింది. అనసూయ అంటే అందానికి అందం ఆమె సొంతం. యాంకరింగ్ లో అయినా అటు నటనలు అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయను ఆంటీ అనడానికి రెండు కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది.
ఒకటి ఆమెను కావాలనే అవమానించడానికి ఎలా ఆంటీ అని పిలుస్తూ హేళన చేస్తున్నారు రెండవది అనసూయకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కనుక ఆంటీ అని పిలుస్తున్నారు. అలా ఆంటీ అనేవాళ్ళకి బుద్ధి లేదు అంటూ ఘాటుగా స్పందించారు సీనియర్ నటి. ఈ క్రమంలోనే మరొకసారి అనసూయ ఆంటీ అనే విషయం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతూ మరొకసారి టోల్ కి గురవుతున్నారు అనసూయ. అనసూయ చూడడానికి ఇంత హాట్ గా ఉన్నప్పటికీ ఇద్దరు పిల్లల తల్లి అని అందరికీ తెలుసు అలాంటప్పుడు మీరు ఏ కోణంలో ఆమెను ఆంటీ అని పిలుస్తున్నారు అర్థం కావడం లేదు. ఆ కారణం చేత అనసూయ ను ఆంటీని (Anasuya Is Described As Aunty) అంటున్నారు తప్పితే. ఆమెని ప్రత్యేకించి ఆంటీ అని పిలవాల్సిన అవసరం లేదని కొంతమంది నెటిజెన్స్ తేల్చి చెబుతున్నారు. అయితే ఈసారి అనసూయని మాత్రం గతం కంటే ఎక్కువగా ఏడిపించారని అర్థమవుతుంది.