Anasuya : సాధారణమైన మనుషులే ఒకరిపై ఒకరు ఎప్పుడు ఏదో ఒకటి నెగటివ్ అనుకుంటూనే ఉంటారు. అలాంటిది సెలెబ్రెటీస్ విషయానికొస్తే వాళ్లని ఎవరో ఒకరు.. ఎప్పుడో ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సెలబ్రెటీస్ ని సామాన్యులు పొగడ్డం, తిట్టడం చేస్తే సెలబ్రిటీస్ లో వాళ్లలో వాళ్లే ఒకరినొకరు ఎదో రకంగా కామెంట్ చేసుకోవడం ( Anasuya comments on Allu Arjun ) కూడా చేస్తూ ఉంటారు. అలాగే అనసూయ గత కొంతకాలంగా అనేక విధాలుగా అందరి నోట్లో నానుతూనే ఉంది. విజయ్ దేవరకొండపై ఆమె చేసిన కామెంట్స్ వలన కొన్ని రోజులు అభిమానులతో అనేక విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తమ్ముడు సినిమా గురించి ఆమె పాజిటివ్ గా మాట్లాడటం వలన ఆ సమస్య అక్కడితో చల్లారింది.
ఇప్పుడు పాపం మళ్ళీ అనసూయ మీద అనేక విమర్శలు వస్తున్నాయి. ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఆమె ఇప్పుడు చేసిన మిస్టేక్ ఏమీ లేదు ఎప్పుడో 8, 9 ఏళ్ల క్రితం ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వీడియో ఇప్పుడు తీసుకొని వచ్చి ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అప్పట్లో అనసూయ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ( Anasuya comments on Allu Arjun ) ఏమైనా ఒక హీరోనా? మెగా ఫ్యామిలీ నుంచి వస్తే అతను హీరో అయిపోతాడా? గంగోత్రి సినిమాలో అతను ఒక పాటలో ఆడ వేషం వేసాడు చూడండి.. బాబోయ్ చూడలేక చచ్చాం. అంటూ ఆమె చేసిన కామెంట్స్ సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కొందరు కావాలని ఆ వీడియోని ఇప్పుడు బయటపెట్టి.. ఆమెను ట్రోల్ చేసే విధంగా తీసుకొని పోతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ వీడియో చూసిన కొందరు ఎప్పుడో ఏదో మాట్లాడి ఉంటుంది.. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ ఎందుకు అని దాన్ని కట్ చేసేస్తుంటే.. మరికొందరు అల్లు అర్జున్ గురించి అనసూయ అంతలా మాట్లాడిందా అని ( Anasuya comments on Allu Arjun ) ఇంకొందరు అంటున్నారు. ఇక అల్లు అర్జున్ అభిమానులైతే అనసూయ మీద మండిపడుతున్నారు. పుష్ప 2 సినిమాలో కూడా అనసూయ ఉంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సినిమాలో నటించి.. పాన్ ఇండియా సినిమాకి నటి అయిన అనసూయ.. ఇప్పుడు మళ్ళీ పుష్పా 2 లో కూడా నటిస్తుంది అన్న సంగతి తెలిసిందే. అంత అల్లు అర్జున్ నచ్చనప్పుడు.. అతను హీరోగా చేస్తున్న సినిమాలోని చేయడానికి ఏం అవసరం వచ్చింది? డబ్బు కోసం నీ ఉద్దేశం మార్చుకున్నావా అంటూ కామెంట్ చేస్తున్నారు.
నిజానికి అప్పట్లో అల్లు అర్జున్ గురించి ఆమె ఎందుకు అలా అన్నదో తెలీదుగానీ.. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఐకాన్ స్టార్. గంగోత్రి సినిమాలో పెద్దగా అందంగా లేని అల్లు అర్జున్ తర్వాత సినిమా నుంచి మంచి లుక్ వచ్చాడు. ఇక అల్లు అర్జున్ లుక్ అన్నా, అతని మాట అన్నా, అతని కంటి చూపు అన్నా, ఒక చిరునవ్వు అన్నా కూడా అమ్మాయిలకు విపరీతమైన ఇష్టం. అలాంటి అల్లు అర్జున్ గురించి అనసూయ ఇలాంటి మాటలు అన్నందుకు అభిమానులు మాత్రమే కాదు, అమ్మాయిలు కూడా బాధపడుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే పుష్ప 2 సినిమా కంప్లీట్ చేసుకునే బిజీలో ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పుష్ప 2 సినిమా పై మెగా అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.