Anasuya: టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతూ వచ్చింది. అంతటి పేరు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మొన్నటివరకు స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో వచ్చినా అవకాశాల్ని వదిలిపెట్టకుండా దూసుకుపోయింది. తనను ఈ స్థాయిలో నిలబెట్టిన, ఇంత పొజిషన్లోకి తీసుకువచ్చిన జబర్దస్త్ నుంచి బయటకు రావడం విశేషం.
జబర్దస్త్ లో తను బాడీ షేవింగ్ కామెంట్స్ తట్టుకోలేక పోవడం వల్ల, రేపు నా పిల్లలు వాటి గురించి నన్ను ప్రశ్నించకూడదు అనే కారణం చేత నేను జబర్దస్త్ నుండి పూర్తిగా బయటకు వచ్చానని తను ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత అనసూయ కి పరిస్థితులు అంతగా అనుకూలించలేదు. ఒకప్పటిలాగా ఆఫర్లు రాకపోవడంతో అనసూయ వచ్చిన ఆఫర్లతోనే మెప్పించడానికి ప్రయత్నిస్తుంది.
ఇదే క్రమంలో పూర్తిగా తన ఏకాగ్రత మొత్తం వెండితెరపై పెట్టిన అనసూయ దానికి తగ్గ కెరియర్ను ప్లాన్ చేసుకుంది. ఇదే క్రమంలో ఇటీవలే ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది అది కాస్త వైరల్ గా మారింది. ఆ వీడియోలో అనసూయ తల పట్టుకుంటూ చాలా డల్ గా ఉన్న వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే క్రమంలో అనసూయ కి ఏమైంది అంటూ నటిజన్స్ ప్రశ్నించగా దీనిపై అనసూయ స్పందించింది.
ఓ విందు భోజనం అనసూయకు అంతగా పడలేదట దీంతో తిన్నదంతా బయటకు వచ్చేసింది అంటూ తెలిపారు. ఆ క్రమంలో తల పట్టుకొని కారులో నీరసంగా కూర్చున్నారు. ప్రస్తుతం పర్లేదని తెలిపింది. ఎప్పుడు యాక్టివ్ గా కనిపించే అనసూయ ఫ్యాన్స్ తనని ఇలా చూడలేకపోతున్నారు. ఆమె యాక్టివ్ గా కనిపించకపొయేసరికి ఆమె ఫ్యాన్స్ కూడా డల్ అయిపోయారు.