
Anand Devarakonda – Vaishnavi : ఈ ఏడాది రిలీజ్ అయిన బేబీ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా దాదాపుగా 100 కోట్లకు పైగా వసూళ్లను తీసుకొని వచ్చింది. లో బడ్జెట్లో ( Anand Devarakonda and Vaishnavi latest movie ) చిన్న చిన్న హీరో హీరోయిన్స్ తో కలిసి తీసిన ఈ సినిమా నిజంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్గా, సాయిరాజేష్ దర్శకత్వంలో రూపొందిన బేబీ సినిమా జూలైలో రిలీజ్ అయ్యి భయంకరమైన బీభత్సాన్ని, సక్సెస్ ని యూత్ లో ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా.
బేబీ సినిమాని ఇంకా మర్చిపోలేదు.. ఈ టీం మళ్లీ మరొక సందడి చేయడానికి రెడీ అయిపొయింది. బేబీ సినిమా టీం వాళ్లు మళ్లీ ఇంకొక సినిమా అదే ( Anand Devarakonda and Vaishnavi latest movie ) కాంబినేషన్ తో చేయబోతున్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా పెట్టి.. నిర్మాత ఎస్కేఎన్ మరియు దర్శకుడు సాయి రాజేష్ కలిసి సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సాయి రాజేషు నిర్మాణంలో ఉంటాడు గాని.. దర్శకత్వం వహించడం లేదు. ఈ సినిమాకి దర్శకుడుగా రవి నంబూరి అనే కొత్త దర్శకుడు తో సినిమాని నిర్మిస్తున్నారు.
కొత్త దర్శకులను ప్రోత్సహించాలని ఎస్కేఎన్ నిర్ణయించుకొని, అలాంటి ఉద్దేశంతోనే వాళ్ళు అడుగులు ముందుకు వేస్తూ ఇప్పటివరకు అన్ని రకాలుగా సక్సెస్ అవుతున్నారు. వీళ్ళకి గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నుంచి, యువ నిర్మాత బన్నీ వాసు నుంచి చాలా సహాయం ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్ళు నిర్మించే ( Anand Devarakonda and Vaishnavi latest movie ) సినిమాల వెనక అల్లు అరవింద్ ప్రోత్సాహం కచ్చితంగా ఉంటుందని అందరికీ తెలుసు. అదే క్రమంలో ఇప్పుడు మళ్లీ ఈ టీం వాళ్ళు.. కేవలం దర్శకుడిని మార్చి.. ఒక కొత్త దర్శకుని పెట్టి వీళ్ళ పర్యవేక్షణలో ఒక సినిమా తీయడానికి నిర్ణయించుకొని, అఫీషియల్ గా అనౌన్స్ చేసి, షూటింగ్ కూడా మొదలుపెట్టారు.
ఆడియన్స్ నాడిని కనిపెట్టి వాళ్లకేం కావాలో అలానే తక్కువ బడ్జెట్ తో కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తూ.. సినిమాలు తీసే వీళ్ళ ఆలోచన విధానం నిజంగా అద్భుతం. దీనివలన ఎందరికో ఎన్నో లాభాలు, చిన్న చిన్న ఆర్టిస్టులకు కొత్త ఆర్టిస్టులకు అవకాశాలు దొరకడమే కాకుండా.. దర్శకులకు కొత్త వాళ్లకు ఎంతో ఛాన్స్ దొరుకుతుంది. అంతేకాకుండా నిర్మాణ విలువలు కూడా తగ్గే అవకాశాలుంటాయి. రెమ్యునిరేషన్ రూపంలో కోట్లకు కోట్లు నిర్మాణ రూపంలో డబ్బు పోకుండా ఆడియన్స్ ని ఆనందింప చేయడం ఎలాగ అనే ఆలోచన విధానం గర్వించదగ్గదే. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవ చైతన్యతో తీయబోయే సినిమాని 2024 సమ్మర్లో రిలీజ్ చేయాలని కూడా డిసైడ్ అయ్యారంట.అంటే మనం వచ్చే సమ్మర్లో మళ్ళీ బేబీ లాంటి టీం ని తీస్తున్న ఒక సినిమాని చూడబోతున్నాం. మరింక అదంతా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి సంచలనాన్ని క్రియేట్ చేస్తుందో చూడాలి.