Nagarjunas Affairs: మన తెలుగు చిత్ర పరిశ్రమ లో ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్న ఎన్నో జంటలు ఉన్నాయి కానీ కడ వరకు సుదీర్ఘ ప్రయాణం చేసే జంటల్లో కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న వాళ్లు ఎవరనే ప్రశ్న తలెత్తితే మాత్రం అది ఖచ్చితంగా మనందరికీ తెలుసు ఆ కపుల్ ఎవరనేది మరి వాళ్ళు మరెవరో కాదు అక్కినేని నాగార్జున అమల జంట వీళ్ళు మొదటి వరుసలో కచ్చితంగా ఉంటారు. ఇక శివ సినిమాతో పరిచయమైన వీళ్ళ బంధం స్నేహం గా మారి ఆ తర్వాత ప్రేమగా మారి చివరికి పెళ్లి వరకు వెళ్ళింది. కుటుంబ సభ్యులను ఎదిరించి మరి వివాహం చేసుకున్నారు.
మొదట్లో అక్కినేని నాగేశ్వర రావు గారు వీళ్ళ వివాహనికి అంగీకరించలేదు. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది. ఐతే ఇటీవల కాలంలో పెళ్లి చేసుకున్న ఎన్నో జంటలు చిన్న చిన్న కారణాలకే మనస్పర్ధలు చేసుకుని ఊరుకూరికే అపార్థ పడుతూ విడాకుల వరకు వెళ్లి విడిపోతున్నారు. కానీ అలాంటిది మూడు దశాబ్దాలు దాటుతున్నప్పటికీ వీళ్ళ దాంపత్య జీవితంలో ఇప్పటి వరకు ఒక్క గొడవ కూడా లేకుండా మనస్పర్ధలు రాకుండా ఎంతో అన్యోన్యంగా ఒకరి కోసం ఒకరు బతకడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందరో పెళ్లి అయినా కొత్త జంటలకు వీళ్లు ఖచ్చితంగా ఆదర్శంగా నిలుస్తారు. అందులో సందేహమే లేదు. ఇక అక్కినేని నాగార్జున కి మొదటి వివాహమైన సంగతి తెలుసు.
తెలిసే అమల నాగార్జునను వివాహం చేసుకుంది. నాగార్జున సోదరి లక్ష్మీని వివాహం చేసుకున్నాడని తెలిసే పెళ్లి చేసుకుంది అమల. అయితే ఆమె తో కొన్నాళ్ల పాటు దాంపత్య జీవితం కొనసాగించినప్పటికీ ఆ మధ్య పలు విభేదాలు కారణంగా విడిపోవాల్సి వచ్చింది. అసలు ఈ విషయం అంతటినీ పక్కన పెడితే నాగార్జున అమల ఎంత పాజిటివ్ మహిళ అనేది ఆయన నోటితోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోస్తాడు. ఆ ఇంటర్వ్యూలో నాగార్జున ఓపెన్ గానే తన ఎఫైర్స్ గురించి తెలియ పరుస్తాడు. నాకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరితో బ్రేకప్ అయిపోగానే మరొకరు వచ్చేవారు. ఎప్పుడూ గర్ల్ ఫ్రెండ్ లేకుండా అయితే నేను లేను ఇదంతా అమలకు తెలుసు.
కానీ అమల చాలా పాజిటివ్ పర్సన్ ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకోగలరు. ఈ సంఘటనలు అన్ని తెలిసినప్పుడు చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంది అనే నాగార్జున (Nagarjunas Affairs) చెప్పుకొచ్చాడు. అయితే నా గర్ల్ ఫ్రెండ్స్ తో నేను చాలా లిమిట్ లో ఉన్నవాడిని.. ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకునే వాడిని కాదు. వాళ్ల అందరితో నేను మంచి రిలేషన్షిప్ మైంటైన్ చేస్తుండే వాడిని గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడుతుంటాను. వాళ్ళు నాతో చాలా కంఫర్ట్ గా మాట్లాడడానికి ఇష్టపడతాడు అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. దాంతో ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.