Home Cinema Amala Paul: జీవితం లో నన్ను అందరూ మోసగించారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న అమలా పాల్..!

Amala Paul: జీవితం లో నన్ను అందరూ మోసగించారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న అమలా పాల్..!

Amala Paul Life: సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగే సత్తా ఉన్న కొంతమంది హీరోయిన్స్ పెళ్లి చేసుకొని మధ్యలోనే కెరీర్ కి ముగింపు పలకడం వంటివి మనం చాలా రోజుల నుండి చూస్తూనే ఉన్నాము. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు అమలా పాల్. తెలుగు ఆడియన్స్ కి ఈమె ‘బెజవాడ’ అనే చిత్రం ద్వారా పరిచయమైన సంగతి అందరికీ తెలిసిందే. అంతకు ముందు ఎక్కువగా ఈమె తమిళం మరియు మలయాళం సినిమాల్లోనే హీరోయిన్ గా నటిస్తూ వచ్చింది.

 

‘బెజవాడ’ సినిమా తో పరిచయమైనప్పటికీ, రామ్ చరణ్ తో చేసిన ‘నాయక్’ సినిమాతోనే ఎక్కువ పాపులారిటీ ని దక్కించుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఈమెకి టాలీవుడ్ అవకాశాలు బాగా వచ్చాయి. ఈ చిత్రం తర్వాత వెంటనే అల్లు అర్జున్ తో కలిసి ‘ఇద్దరమ్మాయిలతో’ అనే చిత్రం లో నటించింది. అలా కెరీర్ పీక్ రేంజ్ లోకి వెళ్తున్న సమయం లో ఈమె తమిళ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లాడింది.

See also  Samantha: సమంత లైఫ్ లోకి మరొక నాగ చైతన్య వచేస్తున్నాడోచ్..

 

కొంతకాలం మంచిగానే దాంపత్య జీవితం కొనసాగినప్పటికీ , ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని మనస్పర్థల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. అప్పటి నుండి అమలా పాల్ (Amala Paul Life) సినిమాలకు దూరం గా ఉంటూ వచ్చింది. ఈమె చేసిన సినిమాలు కూడా వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ రావడం తో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అమలా పాల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘ రీసెంట్ గా మైనా సినిమా చేస్తున్నప్పుడు నాలో చాలా మార్పులు కనిపించాయి, తీవ్రమైన మనస్తాపానికి గురి అయ్యాను.

See also  Balakrishna - Jr NTR : బాలకృష్ణ అన్న అంత పెద్ద మాటకు జూనియర్ ఎన్టీఆర్ సమాధానం..

 

జీవితం లో ఒంటరి మనిషిని అయ్యాను, కరోనా తర్వాత సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి, చేసిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. నాలో ఉన్న బాధ ని ఎవరికీ చెప్పుకోవాలో తెలియదు. 13 వ ఏటా నుండే సంపాదించడం మొదలు పెట్టాను, కానీ నా జీవితం లో సుఖం అనేదే లేదు, ఇంకా వెట్టుకుంటూనే ఉన్నాను, జీవితం లో నన్ను అందరూ మోసగించారు, ఇలాంటి సమయం లో నాకంటూ ఒక సొంత మనిషి పక్కన ఉంది ఉంటే బాగుండేది అనిపించింది. ఇలా ఒంటరిగా ఫీల్ అయ్యేదానిని కాదు’ అంటూ చెప్పుకొచ్చింది అమలాపాల్.