Samantha : గత రెండేళ్ల క్రితం సమంత మరియు నాగ చైతన్య విడిపోయిన తర్వాత సోషల్ మీడియా లో వాళ్ళిద్దరి గురించి ఎన్ని ప్రత్యేక కథనాలు వచ్చాయో మన అందరికీ తెలిసిందే. నిత్యం వీళ్లిద్దరు ఈ విషయం లో ట్రెండింగ్ లోనే ఉంటారు. వాళ్లిద్దరూ అసలు మాకు పెళ్లి అయ్యింది, విడాకులు కూడా తీసుకున్నాము అనే విషయాన్నే మర్చిపోయి ఎవరి కెరీర్స్ లో వార్యు బిజీ గా ఉన్నారు(Amala hurt Samantha). కానీ నెటిజెన్స్ మాత్రం వాళ్ళిద్దరిని వదలడం లేదు. తరచూ వీళ్ళ గురించి ఎదో ఒక పుకారు పుట్టిస్తూనే ఉన్నారు. ఇకపోతే వీళ్లిద్దరు ఎందుకు విడిపోయారు అనే విషయం ఎవరికీ తెలియదు.
ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు రాసుకున్నారు కానీ, నిజమైన కారణం మాత్రం తెలియదు. అయితే వీళ్ళు విడిపోవడానికి కారణం అమల అనే తెలుస్తుంది. పెళ్ళై ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుండి ఆమె పెట్టె ఆంక్షలు చాలా కఠినంగా ఉండేవట(Amala hurt Samantha). సమంత అత్తయ్యే కదా అని ప్రతీ విషయాన్నీ తట్టుకుంటూ వచ్చింది. కానీ ఆమె పెట్టే ఆంక్షలు లిమిట్స్ ని కూడా దాటేసింది. ఆత్మాభిమానం కి పెట్టింది పేరు లాగ అనిపించే సమంత వీటిని తట్టుకోలేక పోయింది. ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఎలాంటి వారితో స్నేహం చెయ్యాలి, చివరికి సినిమాలు చెయ్యడానికి కూడా ఆమె అనుమతిని తీసుకొని చెయ్యాల్సి వచ్చేది అట.
అంతే కాకుండా సమంత సంపాదించే డబ్బు మొత్తం ఇంట్లోనే ఇచ్చేది అట. ఇదంతా అమల నే మ్యానేజ్ చేస్తుందట. సమంత కి ఒక పది వేలు కావాల్సి వచ్చినా అమల ని అడిగే తీసుకునే పరిస్థితి వచ్చిందట. ఇక నాగ చైతన్య కూడా అమల ఏది చెప్తే అది చెయ్యడం, సమంత తో చేయించాం వంటివి చేసేవాడట. ఇక్కడే వీళ్లిద్దరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. అవి రాను రాను పెరిగి పెద్దది అయ్యి ఇద్దరు విడాకులు తీసుకునే రేంజ్ కి వెళ్ళింది. అలా చూడ ముచ్చటగా ఉండే ఈ జంట విడిపోయింది. మళ్లీ వీళ్లిద్దరు కలవడం అనేది అసాధ్యం, కానీ కలిస్తే చాలా బాగుంటుంది అని అందరూ కోరుకుంటున్నారు.
వీళ్ళు కలిసి జీవితం పంచుకోకపోయిన, కనీసం కలిసి ఒక సినిమాలో అయినా కనిపిస్తే బాగుండును అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. వీళ్లిద్దరు చివరిసారిగా వెండితెర మీద కనిపించిన మజిలీ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి. ఐతే మాత్రం అన్ని రికార్డులు బద్దలు అవ్వటం ఖాయం అనే చెప్పాలి. సమంత నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో, మొన్న వచ్చిన సెన్సార్ రివ్యూ ప్రకారం సినిమా చల్ రొమాంటిక్ గా ఉంది అట. ఈ సినిమా కానీ హిట్ ఐతే మాత్రం సమంత ని ఎవ్వరు అందుకోలేరు.