Amala: తెలుగు సినీ అభిమానులందరికీ అక్కినేని అమల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన అమల నాగార్జునని పెళ్లి చేసుకుంది. నాగార్జున అప్పటికే రామానాయుడు ( Amala Naga Chaitanya and Akhil ) కూతురితో మొదటి పెళ్లి జరిగి నాగచైతన్య పుట్టాడు.నాగచైతన్య పుట్టిన కొంత కాలానికి వాళ్ళిద్దరికీ పడక విడిపోవడం జరిగింది. తర్వాత అమలాని నాగార్జున ప్రేమించి ఒకరిని ఒకరు ఇష్టపడి.. పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ రోజుల్లో అమల నాగార్జున సినిమాలంటే చాలా క్రేజీగా చూసేవారు. వీళ్లిద్దరిది మంచి కెమిస్ట్రీ ఉన్న లవ్ జంట. శివ సినిమా లో వీళ్ళిద్దరూ కలిసి నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టారు.
అమల అక్కినేని వారి ఇంటి కోడలిగా, నాగార్జున భార్య అయిన తర్వాత సినిమాల్లో పెద్దగా నటించడం మానేసి.. ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండిపోయింది. అలాగే అఖిల్ పుట్టడం జరిగింది. అయితే నాగార్జున పిల్లలిద్దరూ నాగచైతన్య, అఖిల్ కి తల్లులు వేరైనప్పటికీ.. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యమైన అన్నదమ్ములుగా.. ఒకరంటే ఒకరికి ( Amala Naga Chaitanya and Akhil ) ఎంతో అభిమానం ఉన్నట్టు చక్కగా పెరిగారు. నాగచైతన్య అఖిల్ తో కలిసి పెరిగాడు. అయితే ఎప్పుడు కూడా అమల నాగచైతన్య గురించి గానీ.. అఖిల్ గురించి గానీ ఎలాంటి స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళిద్దరిలో ఎవరంటే ఇష్టమనేది ఎవరికి పెద్దగా తెలియదు. అమల చాలా సింపుల్ గా ఉండే మనిషి. మూగజీవులని ఎక్కువగా ప్రేమిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. మూగజీవులనే అంతగా ప్రేమించే మనిషి పిల్లల్ని ఇంకా ఎంతగా ప్రేమిస్తాదో మనందరం ఊహించుకోవచ్చు.
ఇటీవల అమల ఒక ఇంటర్వ్యూకి పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో.. నాగచైతన్య గురించి ఆమెను ప్రశ్నించగా.. అమలా ( Amala Naga Chaitanya and Akhil ) మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అమల నాగచైతన్య గురించి మాట్లాడిన మాటలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. నాగచైతన్య అత్యంత తెలివైనవాడు, ఎంతో ధైర్యవంతుడు, తనకు ఏం కావాలి, ఏం వద్దు అన్నది అతనికి బాగా తెలుసు. అలాగే కెరీర్ పట్ల, పని పట్ల ఫోకస్ గా ఉంటాడు. సో బ్రిలియంట్ గై అంటూ అమల ఎంతో గొప్పగా నాగచైతన్య గురించి చెప్పుకొచ్చింది. అలాగే అఖిల్ గురించి కూడా వాళ్ళ అడగ్గా.. అఖిల్ గురించి అమల పీపుల్ లవింగ్ పర్సన్ అని చెప్పి తేల్చేసింది. దీనితో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. నాగచైతన్య గురించి అంత గొప్పగా అన్ని మాటలు చెప్పిన అమల.. అఖిల్ గురించి సింపుల్గా ఒక మాట చెప్పి ఎందుకు వదిలేసింది.
కన్న కొడుకు కంటే పెంచిన ప్రేమే ఎక్కువగా ఉంటుందా? లేదా పెంచిన కొడుకు గురించి గొప్పగా చెప్పకపోతే అందరూ ఏమైనా అనుకుంటారని అలా చెప్పిందా? లేకపోతే కన్న కొడుకు గురించి ఎక్కువగా చెబితే గొప్పలు చెప్పుకుంటున్నట్టు ఫీల్ అవుతారని తక్కువగా చెప్పి ఆపేసిందా? అంటూ ఎన్నో కామెంట్లు చేసుకుంటున్నారు. ఏదేమైనా అమల మనస్తత్వాన్ని బట్టి ఆమె గురించి అర్థం చేసుకునే వాళ్ళందరూ కూడా.. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పది. మూగజీవులనే ప్రేమించే అమల కచ్చితంగా పిల్లలని ఎక్కువగా ప్రేమిస్తాదని.. కన్న ప్రేమకి, పెంచిన ప్రేమకి తేడా ఇదే అని అమల నిరూపించిందని అందరూ పొగుడుతున్నారు.