Allu Arjun : మెగాస్టార్ కి కొడుకు, మేనల్లుళ్లు ఇలా ఎందరో సినిమా రంగంలో మెగా హీరోలుగా ఆయన తరపు నుంచి అడుగు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అందులో అల్లు అర్జున్ కూడా ఒకడు. అయితే మెగా హీరోగా అల్లు అర్జున్ ( Allu Arjun ande Pawan ) అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ఒక స్పెషల్ క్రేజీ ని క్రియేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ తన పేరులోనే అల్లుని ఇంక్లూడ్ చేస్తూనే తన అభిమానులకు అలవాటు చేస్తూ అల్లు అర్జున్ గా ఎదిగాడు అల్లు అర్జున్. అందుకే ఈరోజు ఎందరో అభిమానులకు ప్రాణం
గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ పై అప్పట్లో ఎవరికీ అంత కాన్ఫిడెన్స్ లేదు కానీ.. ఆ సినిమా తర్వాత నుంచి తను వేసిన ప్రతి అడుగు కూడా అభిమానులను క్రియేట్ చేసే విధంగానే ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ లో ఎన్నో ట్యాలంట్స్ ఉన్నాయి. నటన, డాన్స్, ఫైట్స్, డైలాగ్ ( Allu Arjun ande Pawan ) డెలివరీ అన్నిటినీ కూడా అదరగొట్టే హీరో. అందుకే అతను అంటే అందరికీ అంత పిచ్చి. అయితే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి కొరియోగ్రాఫర్ గా చేశాడు అన్న విషయం చాలామందికి తెలియదు. పవన్ కళ్యాణ్ సినిమాకి అల్లు అర్జున్ కొరియోగ్రాఫర్ గా పనిచేశాడు.
పవన్ కళ్యాణ్ సినిమాల్లో గుడుంబా శంకర్ సినిమా నీకు గుర్తే ఉండి ఉంటుంది. 2004లో విడుదలైన గుడుంబా శంకర్ సినిమా యావరేజ్ గా ఆడింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా, మీరాజాస్మిన్ హీరోయిన్గా చేసింది. గుడుంబా శంకర్ ( Allu Arjun ande Pawan ) సినిమాలో చిలకమ్మా అనే పాట ఒకటి ఉంటుంది. ఈ పాటకి మంచి నేమ్ వచ్చింది. ఈ పాటకి కొరియోగ్రఫీ అల్లుఅర్జున్ చేశాడంట తను చాలా ఇష్టంగా చాలా శ్రద్ధ పెట్టి కొరియోగ్రాఫ్ చేయగా ఆ పాట మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది.
వీర శంకర్ బైరిశెట్టి దర్శకత్వంలో రూపొందిన గుడుంబా శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్, మీరాజాస్మిన్ తో పాటు హీరోయిన్గా చేయగా ఇంకా ఆశిష్ విద్యార్థి విలన్ గా చేశారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, సాయాజిత్ షిండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని నాగబాబు మరియు మన్యం రమేష్ కలిసి నిర్మించారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాకి అల్లు అర్జున్ కొరియోగ్రఫీ చేశాడన్న విషయం చాలామందికి తెలియదు. అయితే ఇన్నాళ్లకు ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వైరల్ అవుతుంది.