Home Cinema Allu Arjun : అల్లు అర్జున్ ఫస్ట్ లవర్ వెలుగులోకి.. సీక్రెట్ తెలిసిన స్నేహారెడ్డి!

Allu Arjun : అల్లు అర్జున్ ఫస్ట్ లవర్ వెలుగులోకి.. సీక్రెట్ తెలిసిన స్నేహారెడ్డి!

allu-arjun-told-about-his-first-love-in-indian-idol-program

Allu Arjun : పుష్ప సినిమాతో పాన్ పాన్ ఇండియా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న అల్లు అర్జున్.. పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమాలో ( Allu Arjun first love ) అల్లు అర్జున్ యాక్షన్ కి ఎందరో సినీ అభిమానులు ఫిదా అయిపోయారు. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో కూడా అభిమానులు పెరిగిపోయారు. ఇక అందరి దృష్టి అల్లు అర్జున్ పుష్ప2 సినిమా మీదనే ఉంది. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ అందరిలో అంత ఆసక్తిని రేకెత్తించింది. ఇక అల్లు అర్జున్ పర్సనల్ విషయానికొస్తే.. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్నేహ రెడ్డితో.. అల్లు అర్జున్ ఎంతో ఆనందంగా ఉండటమే కాకుండా..

allu-arjun-told-about-his-first-love-in-indian-idol-program

వాళ్ళిద్దరికీ ఇద్దరు చూడ చక్కని పిల్లలు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. టైం దొరికినప్పుడు అల్లు అర్జున్ కుటుంబంతో ఎంత ఆనందంగా గడుపుతాడో ఆయన భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పోస్టులు చూస్తే అర్థమవుతుంది. ఇటీవల అల్లు అర్జున్ కూతురు శాకుంతలం సినిమాలో నటించి తండ్రికి తగ్గ కూతురిగా తన ( Allu Arjun first love ) నటనా ప్రతిభని అంత చిన్న వయసులో చూపించి.. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ.. అల్లు అర్జున్ అన్న ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ ఫస్ట్ లవ్ వేరే అమ్మాయి ఉందని.. ఆ అమ్మాయి పేరు కూడా వెలుగులోకి రావడంతో ఈ వార్త దుమారం రేపుతుంది. పోనీ ఇదేదో రూమర్ అయి ఉంటది..

See also  Roja Ramani: అందరూ చూస్తుండగానే ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నారు అంటూ.. చలనమైన వ్యాఖ్యలు చేసిన రోజా రమణి..

allu-arjun-told-about-his-first-love-in-indian-idol-program

నిజం కాదు అనుకోవడానికి.. ఇది ఆ వెబ్సైట్లో, ఈ వెబ్సైట్లో, సోషల్ మీడియాలో కామెంట్స్ ద్వారా వచ్చింది కాదు. స్వయానా అల్లు అర్జున్ తన నోటితో తన ఫస్ట్ ఫ్లవర్ గురించి చెప్పడమే కాకుండా, ఫస్ట్ లవర్ పేరు కూడా ధైర్యంగా చెప్పేసాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. అల్లు అర్జున్ ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం ఫినాలే కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్స్ సీజన్ 2 కి చీఫ్ గెస్ట్ గా వెళ్లిన ( Allu Arjun first love ) అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ షోలో పాల్గొన్నకంటెస్టెంట్ శృతి అల వైకుంఠపురంలోని ఓ మై గాడ్ డాడీ అనే పాటను పాడింది. అయితే ఆ పాట విన్నాక అల్లు అర్జున్ నీ పేరేంటి అమ్మ అని అడిగాడు. దానికి ఆమె శృతి అని సమాధానం చెప్పింది.

See also  ప్రముఖ నిర్మాత కన్నుమూత.. శోక సముద్రంలో సినీ ఇండస్ట్రీ..

allu-arjun-told-about-his-first-love-in-indian-idol-program

దానికి అల్లు అర్జున్.. అవునా శృతి అనే పేరు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే.. నా ఫస్ట్ లవర్ పేరు అదే అని చెప్పాడు. అంతే అక్కడితో జనాల అందరి కాన్సన్ట్రేషన్ అల్లు అర్జున్ ఫస్ట్ లవ్ మీదకు వెళ్ళింది. శృతి నా ఫస్ట్ లవ్ అని చిన్నప్పటి ఫస్ట్ స్టాండర్డ్ లో, సెకండ్ స్టాండర్డ్ లో ఫ్రెండ్ అని మాత్రం చెప్పరు కదా అని గీతామాధురి అంటుంది. దానికి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఫస్ట్, సెకండ్ క్లాస్ లో లవ్ అయితే ఇంతలా సిగ్గుపడుతూ చెప్పనుగా అన్నాడు. అయితే దాని గురించి ఇంకా చెప్పండి అన్నట్టు చూస్తుంటే.. దీని గురించి నేను ఇంతకంటే ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయను. ఎందుకంటే ఇంటి దగ్గర మా ఆవిడ స్నేహ రెడ్డి ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటాది అని చెప్పాడు. ఇక అల్లు అర్జున్ పూర్తి లవ్ స్టోరీ తెలుసుకోవాలంటే ఆ ప్రోగ్రాం వచ్చిన తర్వాత తెలుస్తాదేమో కానీ.. ఇప్పటికే అల్లు అర్జున్ ఫస్ట్ లవ్ సీక్రెట్ బయటకు వచ్చాక.. స్నేహారెడ్డి ఎలా రియాక్ట్ అవుతాది అనేదానిపై సోషల్ మీడియాలో తెగ చర్చలు అవుతున్నాయి.