Home Cinema Animal – Allu Arjun : అనిమల్ సినిమా ఏ లిస్ట్ లో చేరుతుందో నిర్భయంగా...

Animal – Allu Arjun : అనిమల్ సినిమా ఏ లిస్ట్ లో చేరుతుందో నిర్భయంగా చెప్పేసిన అల్లు అర్జున్..

allu-arjun-posted-a-post-about-animal-movie-review

Animal – Allu Arjun : డిసెంబర్ నెలలో ఇప్పటికి చాలా సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఒకే ఒక్క సినిమా గురించి మాత్రం మాట్లాడుకోవడం ఆపడం లేదు. ఇప్పటికి అనిమల్, హాయ్ నాన్న, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్.. ఇలా రిలీజ్ అయ్యాయి. అయినా ( Animal and Allu Arjun ) కూడా డిసెంబర్ ఒకటో తేదీని రిలీజ్ అయిన అనిమల్ సినిమా గురించి మాత్రం మాట్లాడుతూనే ఉన్నారు. ఈ సినిమా గురించి పాజిటివ్గా, నెగిటివ్గా ఎందరో ఎన్నో మాట్లాడుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా చూసిన తర్వాత.. ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చాడు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Allu-Arjun-review-about-Animal-movie-on-social

అల్లు అర్జున్ అనిమల్ సినిమా గురించి పోస్ట్ ఈరకంగా పెట్టాడు.. ఈ చిత్రం మైండ్ బ్లోయింగ్, సినిమా బ్రిలియన్స్ అద్భుతమన్నారు. ఇక ఈ సినిమాలో హీరో రన్బీర్ కపూర్ భారతీయ సినిమాని సరికొత్త స్థాయికి తీసుకొని వెళ్ళాడని చెప్పారు. అలాంటి అద్భుతానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడని మెచ్చుకున్నాడ. రష్మిక నటన అయితే ( Animal and Allu Arjun ) బ్రిలియంట్ అని చెప్పుకొచ్చాడు. అత్యుత్తమ నటన కనబరిచిందని తన తో పాటు ప్రజెంట్ శ్రీవల్లిగా నడుస్తున్న రష్మికని తెగ పొగిడాడు అల్లు అర్జున్. అనిల్ కపూర్, బాబీ డియోల్ చాలా చక్కగా అద్భుతంగా నటించారని చెప్పారు. మరో నటి తృప్తి నటనతో ఎందరినో ఆకట్టుకుందని.. వాళ్ల మనసులను కొల్లగొట్టిందని పొగిడాడు.

See also  Allu Arjun : అల్లు అర్జున్ కి ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువ నచ్చిందంటే..

Allu-Arjun-review-about-Animal

ఇంకా అల్లు అర్జున్ అనిమల్ సినిమా టీం కి కంగ్రాట్యులేషన్స్ చెప్పాడు. ఇక ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డివంగ గురించి చెబుతూ.. దర్శకుడు సందీప్ మీరు అన్ని సినిమా పరిమితులను అధిగమించారు. మీరు మరోసారి మా అందరిని గర్వపడేలా చేశారు. మీ సినిమాలు భవిష్యత్తులో భారతీయ సినిమా ముఖచిత్రాన్ని ( Animal and Allu Arjun )ఎలా మార్చబోతున్నాయో స్పష్టంగా కనిపిస్తుంది అంటూ సందీప్ రెడ్డి వంగని విపరీతంగా పొగిడారు. అంతేకాకుండా అనిమల్ సినిమా ఖచ్చితంగా ఇండియన్ సినిమా క్లాసిక్ మూవీస్ లిస్టులో చేరుతుందని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే అనిమల్ సినిమా 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసుకుని వచ్చేసింది. ఇక ఈ సినిమా ఇంకా ఎంత సంచలనాన్ని క్రియేట్ చేస్తుందో చూడాలి.

See also  VD12 : విజయ్ దేవరకొండ VD12 తో రష్మిక కు లింక్ ఉందా..

Allu-Arjun-review-about-Animal-movie-team

ఇక ఈ సినిమా పై అనేక నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి కానీ.. వాటన్నిటికీ అతీతంగా కలెక్షన్స్ మాత్రం వస్తున్నాయి. అలాగే ఈ సినిమాని అనేకమంది సెలబ్రిటీస్ పొగుడుతున్నారు. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల అల్లు అర్జున్కి ఆ షూటింగ్ నిమిత్తం ఆరోగ్యం పాడైందని.. షూటింగ్ ఆపి రెస్ట్ తీసుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే అల్లు అర్జున్ అభిమానులైతే పుష్ప 2 సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా 2024 ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవుతుందని చెప్పారు. ఆ రోజు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ ఈ సారి మరచిపోలేని అద్భుతమైన సంచలనాన్ని క్రియేట్ చేయాలని ఆయన అభిమానులు ఎంతో ఆశపడుతున్నారు.