Home Cinema Allu Arjun : ఈ ఫొటోలో అల్లు అర్జున్ తన పిల్లలు ఇద్దరికీ ఏం చూపిస్తున్నాడో...

Allu Arjun : ఈ ఫొటోలో అల్లు అర్జున్ తన పిల్లలు ఇద్దరికీ ఏం చూపిస్తున్నాడో తెలుసా?

allu-arjun-having-fun-time-with-kids-in-his-house

Allu Arjun : పుష్ప 2 సినిమా తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిజీ గా ఉన్న సంగతి మనందరికీ తెలిసినదే. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఎంత ( Allu Arjun having fun time with kids in his house ) పెద్ద హిట్ అయ్యిందో కొత్తగా చెప్పుకోనక్కరలేదు. అది అంత సక్సెస్ అయ్యిందికాబట్టే.. పుష్ప 2 వెంటనే మొదలు పెట్టి షూటింగ్ జరుగుతూ వస్తుంది. ఇటీవల పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయ్యి.. భారీ స్థాయిలో వ్యూవర్స్ ఆదరణ పొందింది. ట్రైలర్ కి తెలుగులో కంటే హిందీ లో ఇంకా ఎక్కువ ఆదరణ పొందింది. మొత్తం మీద అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడికో వెళ్తుంది.

See also  Nagarjuna - Anushka - Naga Chaitanya: ఇదంతా నాగార్జున చేసిందే.. అనుష్క నాగ చైతన్యల మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో మీకు తెలుసా?

allu-arjun-having-fun-time-with-kids-in-his-house

ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ హీరోలు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నారు. పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు ఎక్కువగా ఇటీవల నిర్మిస్తూ ఉండటం వలన మన తెలుగు హీరోలకు ప్రాధాన్యత ఎక్కువే అవుతుంది. అలాగే అల్లు అర్జున్ కి కూడా బాలీవుడ్ లో ( Allu Arjun having fun time with kids in his house ) మంచి క్రేజ్ పెరుగుతుంది. అందుకే వాళ్ళ ప్రాజెక్ట్స్ కి కూడా అల్లు అర్జున్ ని తీసుకునే ఆలోచనలు మీద వార్తలు వస్తూనే ఉన్నాయి. సెలబ్రెటీలు ఎంత బిజీగా ఉంటె వాళ్ళ పర్సనల్ లైఫ్ ని అంత మిస్ అవుతారన్న సంగతి మనందరికీ తెలిసినదే.

allu-arjun-having-fun-time-with-kids-in-his-house

ఇటీవల అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ శాకుంతలం సినిమాలో నటించింది. అల్లు అర్ష సినిమాల్లో నటించడం ఇదే మొదటి సారి. ఈ సినిమాలో అల్లు అర్ష చాలా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా ఆమె తెలుగు భాష చక్కగా డబ్బింగ్ చెప్పింది. కెమెరాకి గాని, పెద్ద ఆర్టిస్ట్స్ కి గాని, ఆ చుట్టూ ఉన్న వాతావరణానికి గాని దేనికి భయం అనేది లేకుండా చక్కగా నటించింది. శాకుంతలం సినిమాకి టాక్ ఎలా వచ్చినప్పటికి.. అల్లు అర్ష కి మాత్రం చాల మంచి పేరు వచ్చింది. పులి కడుపున పులిపిల్లే పుడతాది అన్నట్టు నటించింది అల్లు అర్ష. అల్లు అర్ష ని చూస్తే అల్లు అర్జున్ దంపతులు వాళ్ళ పిల్లలని ఎంత బాగా పెంచుతున్నారో తెలుస్తాది.

See also  Tamannaah - Vijay Varma: పెళ్ళికి ముందే తమన్నా కు అలాంటి కండిషన్ పెట్టిన విజయ్ వర్మ.!

allu-arjun-having-fun-time-with-kids-in-his-house

అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి పిల్లలని పెంచడంలో చాల బాగా పెంచుతున్నారని ఆ పిల్లలు ఇద్దర్ని చూస్తే అర్ధం అవుతుంది. అలాగే అల్లు అర్జున్ కూడా టైం దొరికినప్పుడల్లా పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ.. వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు. ఆ ముచ్చట్లను అల్లు స్నేహ రెడ్డి ఎప్పటికప్పుడు వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాది. అవి చూసి అభిమానులు మురిసిపోతూ ఉంటారు. ఇటీవల బన్నీ పిల్లలతో తన గార్డెన్ లో నవ్వారు మంచం మీద పడుకుని పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఆకాశంలో నక్షత్రాలను చూపిస్తూ మన హీరో వాళ్లకు ఏం కథ చెబుతున్నాడో?