Allu Arjun : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న అల్లు అర్జున్ గురించి ఇప్పుడు ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంతకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ అందుకోని జాతీయ ఉత్తమ నటుడి అవార్డుని ( Allu Arjun emotional speech ) అందుకున్న అల్లు అర్జున్ ను చూసి తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినీ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు అందరూ కూడా ఆనందంతో పొంగిపోతున్నారు. అల్లు అర్జున్ ఈ బహుమతిని ఈ అవార్డుని అందుకునేందుకు ఢిల్లీ వెళ్లి.. తన భార్య, తల్లి, తండ్రి సమక్షంలో అక్కడ వేడుకలో అభిమానులందరూ లైవ్లో చూస్తుండగా ఆ గౌరవాన్ని అందుకుంటూ.. ఆయన ఆనందంతో చూసిన చూపులు మెగా అభిమానుల కడుపుని నింపేసాయి.
ఇక అల్లు అర్జున్ వెనక్కి వచ్చిన తర్వాత ఘనస్వాగతాన్ని చెప్పి.. వాళ్ళ అభిమానాన్ని చూపించారు అల్లు అర్జున్ అభిమానులు. ఇక కుటుంబ సభ్యులైతే అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా సెలబ్రేట్ చేసుకొని.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గ్రాండ్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో ( Allu Arjun emotional speech ) పాల్గొన్న అల్లు అర్జున్ తన పర్సనల్ విషయాలు కొన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అల్లు అర్జున్ ఆ విషయాలు చెప్పిన తర్వాత అందులో కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ నోటి నుంచి వచ్చిన మాటలు నిజంగా అందరినీ ఇన్స్పైర్ చేశాయి.
అల్లు అర్జున్ ని తన ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా.. ” ఎప్పుడు స్కూల్లో టీసీ తీసుకోవడమేనా? ప్రెసిడెంట్ నుంచి మెడల్ తీసుకోవా? ” అని సరదాగా ఏడిపించే వారంట. అదే నేను బెస్ట్ కాంప్లిమెంట్ గా తీసుకున్నానని అల్లు అర్జున్ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ కాంప్లిమెంట్ ఈరోజు వచ్చేసింది. ఈరోజు నేను అది సాధించాను. నిజంగా ( Allu Arjun emotional speech ) చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు. అల్లు అర్జున్ చెప్పిన ఈ మాటలు వింటే.. ప్రతి ఒక్కరిలోనే ఒక ఉత్సాహం వస్తుంది. తగిలే రాళ్ళని పునాదిగా తలచి ఎదగాలని అనే మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఇలానే మనిషి తనను ఎవరైనా ఏమైనా అంటే దానికి కృంగిపోకుండా.. దాన్ని కాంప్లిమెంట్ గా తీసుకోవాలన్న మాట అని అర్థమవుతుంది.
ఈ అవార్డు పై ఎక్కువ కాన్ఫిడెన్స్ తనకంటే కూడా సుకుమార్ కి ఎక్కువగా ఉందని, అల్లు అర్జున్ చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. పుష్ప 2 సినిమాపై తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. భారతదేశము మొత్తం ఈ సినిమా రిజల్ట్ గురించి ఎదురుచూస్తుంది. ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఎదురుచూస్తుంది కాబట్టి కచ్చితంగా ఈ సినిమాతో మరొక సంచలనాన్ని క్రియేట్ చేయడం ఖాయమని అల్లు అర్జున్ అభిమానులు అనుకుంటున్నారు.