Home Cinema Sai Dharam Tej: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంత గొప్ప త్యాగం చేసాడా సాయి...

Sai Dharam Tej: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంత గొప్ప త్యాగం చేసాడా సాయి ధరమ్ తేజ్ కోసం చాలా గొప్పోడే.

Allu Arjun Sacrifice: మెగా కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన వాళ్లలో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. 2014 సంవత్సరంలో తెలుగు చలన చిత్ర రంగంలోకి పిల్ల నువ్వు లేని జీవితం అనే చిత్రంతో తెరగ్రేటం చేశాడు సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సాధించుకుని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు అనే చెప్పాలి. ఇక ఇటీవలే విడుదలైన విరుపాక్ష చిత్రం సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ ను కైవసం చేసుకోవడంతో ఒక్కసారిగా సాయి ధరమ్ తేజ్ మార్కెట్ సినిమా ఇండస్ట్రీలో విపరీతంగా పెరిగింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రం అనంతరం మావయ్య పవన్ కళ్యాణ్ తో మనందరిని పలకరించడానికి బ్రో చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు.

allu-arjun-did-such-a-big-sacrifice-for-sai-dharam-tej-no-other-hero-can-do-it

ఈ మెగా మల్టీ స్టారర్ మూవీని సముద్రఖని ఆధ్వర్యంలో తెరకెక్కగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు. తమిళంలో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సీతంకు రీమేక్ గా రూపొందించుకున్న చిత్రం బ్రో. ఇక ఈ చిత్రం జూలై 28వ తారీఖున అంగరంగ వైభవంగా విడుదలకు సిద్దమవుతున్నది.  అందుకుగాను సినిమా ప్రచారాన్ని జోరుగా షూరూ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని కాస్త పక్కన పెట్టి అసలు విషయంలోకి వెళ్తే.. సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీలో ఇలా నిలదుక్కుకోవడానికి కారణం అల్లు అర్జున్ అంటూ ఒక వార్తను నెట్టింట వైరల్ అవుతుంది.

See also  ఎద అందాలను ఆరబోస్తున్న అషు రెడ్డి.. కుర్రకారులను హీట్ చేస్తుంది.

allu-arjun-did-such-a-big-sacrifice-for-sai-dharam-tej-no-other-hero-can-do-it

అవును అల్లు అర్జున్ చేసిన ఆ త్యాగం (Allu Arjun Sacrifice) వల్లే సాయి ధరమ్ తేజ్ తనకంటూ గొప్ప గుర్తింపుని ఇండస్ట్రీలో సాధించుకున్నాడట. అసలు దానికి కారణం ఏంటనేది చూసినట్లయితే.. సాయి ధరమ్ తేజ్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ సుప్రీమ్. ఇక ఈ చిత్రం దర్శకత్వం వహించింది అనిల్ రావిపూడి కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గారు నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా రాసి కన్నా.. పలు ముఖ్యమైన పాత్రలలో రాజేంద్ర ప్రసాద్, కబీర్ సింగ్ దుహ, రవి కిషన్, సాయికుమార్ మొదలైన వారు కీలకమైన పాత్రలలో నటించారు.

See also  Varun Tej : బిగ్ సీక్రెట్.. వరుణ్ ఫస్ట్ లవ్ గురించి తెలిసి లావణ్య ఎం చేసిందంటే..

allu-arjun-did-such-a-big-sacrifice-for-sai-dharam-tej-no-other-hero-can-do-it

ఇక ఈ చిత్రం 2016 సంవత్సరంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ బ్లాక్ బసర్ చేసుకోవడమే కాకుండా సాయి ధరంమ్ తేజ్ కి మంచి పేరు తీసుకువచ్చింది. ఇక ఈ చిత్రంతోనే మెగా మేనల్లుడు పేరు పోయి సుప్రీం హీరోగా మారాడు. ఈ చిత్రం వల్లే తెలుగు ప్రేక్షకులకు ఈ మెగా మేనల్లుడు బాగా చేరువయ్యాడు. కానీ నిజానికి అసలు ఈ సినిమా చేయాల్సింది అల్లు అర్జున్ తో నట.  పటాస్ తో బంపర్ హిట్ అందుకున్నారు అనిల్ రావు పూడి మొదట సుప్రీం కథను అల్లు అర్జున్ తో ఊహించుకొని సిద్ధం చేసుకున్నారట. అలా బన్నీకి ఈ చిత్రం యొక్క కథను చెప్పగా ఆయనకు చాలా బాగా నచ్చిందట. కానీ అప్పుడప్పుడు హీరోగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్న తేజ్ తో ఈ చిత్రం చేయాలని బన్నీ సజెస్ట్ చేశాడటకు ఈ సినిమా చాలా ప్లస్ గా మారుతుందని చెప్పాడట. దాంతో నేరుగా ఈ స్టోరీని తేజ్ ముందల పెట్టడం.. ఆ తర్వాత సినిమా విడుదలవ్వడం.. సూపర్ హిట్ కొట్టడం.. కట్ చేస్తే స్టార్ హీరోగా సాయి ధరమ్ తేజ్ మారడం అంతా చక చక జరిగిపోయాయి ఆరోజు బన్నీ చేసిన త్యాగం వల్లే ఇవాళ సాయి ధరమ్ తేజ్ కెరియర్ ఇంతలా నిలబడగలిగింది.