Home Cinema Allu Arjun : అల్లు అర్జున్ పనిమనిషి కోసం ఎం చేసాడో చూడండి.. వైరల్ అవుతున్న...

Allu Arjun : అల్లు అర్జున్ పనిమనిషి కోసం ఎం చేసాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో..

allu-arjun-did-a-selfy-video-for-his-housemaid-that-became-viral

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే సినీ అభిమానులందరికీ ఒక రకమైన ప్రత్యేకమైన గౌరవం, ఇష్టం. అలాగే అల్లు అర్జున్ అభిమానులకైతే తమ హీరో అంటే ప్రాణం. అల్లు అర్జున్ తాను చేసే పాత్రలను కూడా ఎంతో చక్కగా ఎన్నుకొని దానికి ప్రాణం పోసి అద్భుతంగా నటించే హీరో. సినిమా బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీలో ( Allu Arjun video for his housemaid ) అడుగు పెట్టినప్పటికీ కూడా.. ఎప్పుడు ఎంతో వినయంగా, పద్ధతిగా, డిస్ప్లేన్ పాటిస్తూ, చిరునవ్వుతోనే ఉంటూ, తనను తాను తీర్చిదిద్దుకుంటూ, ఎదుటివారికి ఒక మంచి గుర్తుగా కనిపించే వ్యక్తి అల్లు అర్జున్. ఈ రోజు ఎలక్షన్స్ సందర్భంగా ఓట్లు వేయడానికి సెలబ్రిటీస్ అందరూ తరలి వెళ్లారు.

Allu-Arjun-video-viral

ఆ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా అందరి కంటే తొందరగా ఓటింగ్ బూత్ కి వెళ్లి.. ఆరున్నర గంటలకు అక్కడ సిస్టం గా నిలబడి ఉన్న హీరో అల్లు అర్జున్. అక్కడ తాను వెళ్లిన తర్వాత అక్కడ ప్రాసెస్ లేట్ అయ్యి.. సుమారు గంట సేపు ( Allu Arjun video for his housemaid ) పైనే అల్లు అర్జున్ లైన్ లో ఒక సామాన్యుడుగా నిలబడి.. ఆ పని పూర్తి చేసుకుని వచ్చాడు. బాధ్యతని ఎంతో సక్రమంగా నిర్వర్తించే మనిషిగా ఎప్పుడు కనిపిస్తాడు అల్లు అర్జున్. పుష్ప 2 సినిమా షూటింగ్ బిజీలో ఉన్నప్పటికీ కూడా.. తన ఓటు హక్కును తన వినియోగించుకొని.. అది కూడా పొద్దున్నే వెళ్లి నిలబడి చక్కగా తన పని తాను పూర్తి చేసాడు.

See also  Rashmika: రష్మిక పై కన్నేసిన వేణుస్వామి.. నిజంగా వాళ్ళిద్దరి మధ్య అలాంటి రిలేషన్ అవసరమా?

Allu-Arjun-video-with-house-maid-and-vote

అల్లు అర్జున్ ఓటు వేయడానికి వెళ్లి వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే మరోపక్క ఇప్పుడు ఇంకొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ ఎలాంటివాడు? ఎలాంటి మనస్తత్వం ఉన్నవాడు? ఎంత మనుషులకి రెస్పెక్ట్ ఇస్తాడు? ఎంత సరదాగా ఉంటాడనేది వీడియో చూస్తే ( Allu Arjun video for his housemaid ) అర్థమవుతుంది. అల్లు అర్జున్ ఒక అమ్మాయి తో కలిసి ఒక సెల్ఫీ వీడియో అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ అమ్మాయి ఎవరు అనే ఆరా తీస్తే.. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పని చేసే అమ్మాయని అర్థమవుతుంది. అయితే ఆ అమ్మాయితో అల్లు అర్జున్ చేసిన వీడియో చూసి అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.

See also  Samantha: సమంత మళ్ళీ అలా చేస్తే ఈ సారి ఆ భగవంతుడు కూడా కాపాడలేదు. పాపం

Allu-Arjun-pushpa2

అల్లు అర్జున్ పెట్టిన ఆ వీడియోలో అల్లు అర్జున్ అమ్మాయితో సెల్ఫీ తీస్తూ.. సరే నీకు బాగా ఫాలోవర్స్ రావాలని ఒక మంచి వీడియో తీస్తా ఓకేనా అని అడుగుతాడు. అమ్మాయి ఓకే అన్నది. నీకు ఎంతమంది ఫాలోవర్స్ కావాలి అని అడిగాడు. నీకు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అని అడిగాడు.ఆ అమ్మాయి నాకు 13 కె ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పింది.అయితే ఇప్పుడు నీకు ఎంతమంది కావాలి అని అడిగాడు. నాకు 30 కే ఫాలోవర్స్ కావాలి అని చెప్పింది. అయితే ఈ వీడియోతో వస్తారా అని అడిగాడు. ఆ అమ్మాయి చిరు నవ్వు నవ్వుతూ వస్తారనుకుంటా.. రావాలని కోరుకుందాం అని మంచి క్యూట్ నవ్వు నవ్వాడు అల్లు అర్జున్. అలా ఒక హౌస్ మేడ్ తో వీడియో తీసి నీ ఫాలోవర్స్ పెరగడానికి నేను వీడియో పెడుతున్నాను అన్న తర్వాత .. అల్లు అర్జున్ ఎదుటి మనిషికి ఎంత విలువిస్తాడో, ఎంత సరదాగా ఉంటాడో, ఎంత మానవత్వంతో బిహేవ్ చేస్తాడు అనేది ఈ వీడియో చూసి అర్థమవుతుంది.