Allu Arjun – Sreeleela : సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరో ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క సీజన్లో వాళ్ల హవా సాగిస్తారు. అలాగే ప్రజెంట్ హీరోయిన్స్లో టాలీవుడ్ లో మంచి హవాలో ఉన్న హీరోయిన్ ఎవరు అంటే శ్రీలీల. ఈమె ఎన్నో ( Allu Arjun called Sreeleea ) ప్రాజెక్ట్ చేతిలో పెట్టుకొని ప్రతి సినిమాలోని ఫస్ట్ లేదా సెకండ్ హీరోయిన్ స్థానంలో అయినా ఉండి తన అందచందాలతో, నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. దసరా నుంచి సంక్రాంతి వరకు వచ్చే ప్రతి సినిమాలోని ఇంచుమించుగా శ్రీలీల కనిపించే అవకాశం ఉంది. ఇలాంటి క్రమంలోశ్రీలీల కి ఎక్కడా కూడా డేట్స్ అనేవి ఖాళీ ఉండటం లేదు.
ఇంత బిజీగా ఉన్న హీరోయిన్ సంగతి పక్కన పెడితే.. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ ఇప్పుడు సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ఆయన అభిమానులు మాత్రమే కాకుండా, సినీ అభిమానులు ( Allu Arjun called Sreeleea ) అందరూ కూడా ఫిదా అయిపోయారు. అందుకే అలాంటి గొప్ప నటనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉండడమే కాకుండా పుష్ప 2 కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేయబోతున్నాడు.
ఆ సినిమాకి గాను అందులో హీరోయిన్గా శ్రీలీల అయితే బాగుంటుందని త్రివిక్రమ్ అడగ్గా.. ఆమె ఇప్పటికే షెడ్యూల్స్ చాలా బిజీగా ఉండి 10, 12 ప్రాజెక్ట్ సైన్ చేసి ఉండడం వలన చేయలేనని చెప్పేసిందంట. దానితో అల్లు అర్జున్ ఈ విషయం తెలియగానే శ్రీలీలకి ఫోన్ చేసి ఆఫర్స్ అనేవి ఎప్పుడు పడితే అప్పుడు రావు.. వచ్చినప్పుడు వాటిలో ( Allu Arjun called Sreeleea ) ఏ సినిమాకి ఎంత ప్రాధాన్యత ఉందో చూసుకోవాలి. కొన్ని సినిమాలు, కొందరు నటులతో కలిసి చేసే ప్రాజెక్టు మిస్ కాకూడదు. అవి మన వరకు వచ్చినప్పుడు మనం కాళ్లతో తనితే ఆ తర్వాత ఎంత గింజుకున్నా కూడా అలాంటి ఆఫర్స్ రావు. దేనినైనా గౌరవించి తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని చాలా స్వీట్గా గట్టి వార్ణింగ్ ఇచ్చాడంట.
వాళ్ళిద్దరి మధ్యన అలాంటి ఒక వాదన జరిగిందని.. అందుకే ఆ స్వీట్ వార్నింగ్ కి భయపడి శ్రీలీల వెంటనే జాగ్రత్తగా చూసుకొని కొన్ని డేట్స్ మార్చుకొని త్రివిక్రమ్ సినిమా అల్లు అర్జున్తో చేయబోయే సినిమాకి ఆమె ఓకే చెప్పిందంట. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. అసలు వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి వాదన జరిగింది అనే దానికి ఎక్కడ వాళ్ళు బయటకు చెప్పింది లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ హల్చల్ చేస్తుంది. ఇక అల్లు అర్జున్ అభిమానులైతే మా హీరో నా మజాకా.. ఏదైనా కూడా చాలా తీయగానే చాలా గట్టిగా ఇస్తాడు అని తిరిగి కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి ఈ జంట ఎలా ఉంటుందో.