Allu Arjun : మెగా కుటుంబం నుంచి మెగా హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ.. తనదైన స్టైల్ లో తనకంటూ ఒక స్టేజ్ ని ఏర్పాటు చేసుకున్న నటుడు అల్లు అర్జున్. అందుకే స్టైలిష్ అల్లు అర్జున్ అని మొదట అనిపించుకుని.. ఆ తర్వాత ( Allu Arjun acted in a short film ) ఐకాన్ అల్లు అర్జున్ గా మారాడు. ఐకాన్ అల్లు అర్జున్ అంటే అమ్మాయిలందరూ పడి చస్తారు అంత స్టైల్ గా నవ్వుతాడు మన హీరో. చిరునవ్వుతోనే ఎదుటి వాళ్ళ హృదయాన్ని దోచుకోగల గొప్ప నటుడు అల్లు అర్జున్. ఇక ఆయన అభిమానులైతే ఆయనలాగే ఎంతో క్రమశిక్షణగా ఉండే అభిమానులు. అల్లు అర్జున్ ప్రతి మాటలో, ప్రతి సినిమాలో, ఆయన బయట రియల్ గా చూపించే ప్రవర్తనలో కూడా మంచి క్రమశిక్షణ అయితే కనిపిస్తాది.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ అంటే ఇప్పుడు భారతదేశమంతటా కూడా అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ సినిమా అంటే ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ సైడ్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దానికి చక్కటి ఉదాహరణ.. ఆయన పుష్ప2 టీజర్ తెలుగులో కంటే హిందీలో ( Allu Arjun acted in a short film ) ఎక్కువమంది చూడడం. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక హీరోయిన్గా రూపుదిద్దుకొని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ భిన్నమైన నటన చాలా ఆకట్టుకుంది. నటుడుగా తనని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లాడు సుకుమార్. సుకుమార్ లో ఉండే గొప్పతనమే అది.. హీరోలకి ఒక ప్రత్యేకమైన మేనరిజాన్ని.. ప్రత్యేకమైన స్టైల్ ని చూపించి అందులో వాళ్ళ నటన టాలెంట్ ని ప్రేక్షకులకు అందిస్తాడు.
పుష్ప సినిమా అంత సక్సెస్ అయిన తర్వాత పుష్ప టు సినిమా మీద అందరికీ అంచనాలైతే ఉన్నాయి. ఆ భారీ అంచనాలను కాస్త భారీగా.. మరింత కాన్ఫిడెంట్ పెంచింది ట్రైలర్. ఇందులో అల్లు అర్జున్ అమ్మవారి రూపంలో కూడా కనబడడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ రూపంలో కూడా అల్లు అర్జున్ ఎంత చక్కగా ( Allu Arjun acted in a short film ) ఇమిడిపోయాడంటే.. అంత చక్కగా సినిమాల్లో.. ఎంత గొప్ప స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న అల్లు అర్జున్.. షార్ట్ ఫిలిం లో కూడా నటించడం చాలా మందికి తెలియదు. అల్లు అర్జున్ ఏమిటి షార్ట్ ఫిలింలో నటించడం ఏంటి అని అనుకుంటున్నారా? నిజం.. అల్లు అర్జున్ ఒక మంచి షార్ట్ ఫిలిం లో కూడా నటించాడు. దానికి దర్శకత్వం వహించింది కూడా ఎవరో కాదు సుకుమార్ నే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఆ షార్ట్ ఫిలిం పేరేమిటంటే..
” అ యామ్ దట్ చేంజ్” ఈ షార్ట్ ఫిలిం లో అల్లు అర్జున్ 8 ఏళ్ల క్రితమే నటించాడు. దీనికి కాన్సెప్ట్ ఏంటంటే.. మన బాధ్యతలను మనం సక్రమంగా చేయడం కూడా దేశభక్తి అని ఆ షార్ట్ ఫిలిం లో చెప్తారు. కేవలం అతి తక్కువ సమయంలో ఎంతో పెద్ద కాన్సెప్ట్ ని అద్భుతంగా చిత్రీకరించి.. అందరికీ చూపించిన గొప్ప దర్శకుడు సుకుమార్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. సుకుమార్ చూపించిన ఈ విధానాన్ని తన స్టైలిష్ నటనతో అల్లు అర్జున్ అదరగొట్టాడు. అలాగే ఇప్పుడు పుష్ప 2 సినిమాలో కూడా సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ మళ్ళీ ఒకసారి ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తాదో చూడడం కోసం అల్లుఅర్జున్ అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ఎంతో సరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ అవుతుందని అందరూ అంచనాలతో ఉండాలి. అ యామ్ దట్ చేంజ్ అనే ఆ షార్ట్ ఫిలిం ని ఒక్కసారి చూసి మీరు కూడా ఫాలో అవ్వండి..