Star Hero : సినిమా ఇండస్ట్రీ అంటే.. హీరోలు, హీరోయిన్స్, దర్శక, నిర్మాతలు, ఇతర నటీనటులు అందరూ సమ్మేళనంగా ఉన్న గొప్ప ఇండస్ట్రీ ఇది. ఇందులో అందరి గురించి సినిమాల్లో.. ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమా పాత్రలో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కానీ.. నిజ జీవితంలో వాళ్లకంటూ ఒక పాత్ర ఉంటుంది. దాని గురించి ( Allu Aravind comments on Hero Srikanth ) తెలుసుకోవడం అంటే అభిమానులకు చాలా ఇష్టంగా ఉంటుంది. వాళ్ళ హీరో, హీరోయిన్ నిజ జీవితంలో ఎలా ఉంటారు? వాళ్ళ నిజ జీవితంలో జరిగే చిన్న చిన్న ముచ్చట్లు అంటే వీళ్ళకి గొప్ప పండుగలా ఉంటుంది. అదే కదా మరి అభిమానం అంటే..
అలా ఎందరితో అభిమానాన్ని సంపాదించుకోవడం నిజంగా నటీనటుల అదృష్టమనే అనుకోవాలి. అలాగే వాళ్లను అంతగా అలరించే నటీనటులు దొరకడం అభిమానులకు కూడా అదృష్టమనే అనుకోవాలి. అయితే సినిమా రంగంలో ఉన్న ప్రముఖుల పర్సనల్ విషయాలు నిజజీవితంలో జరిగే సంఘటనలో తెలుసుకోవాలంటే ( Allu Aravind comments on Hero Srikanth ) అది సినిమాల్లో కుదరదు. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఇచ్చే ఇంటర్వ్యూలు బట్టి, కొన్ని వేడుకల్లో వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి ఆ విషయాలు తెలుస్తూ ఉంటాయి. అందుకే సినిమా వాళ్ళు ఎక్కడ ఏం చేసినా కూడా అది మంచి క్రియేషన్ క్రియేట్ చేస్తుంది. తెర వెనుక కథలు అని ఒక ప్రోగ్రాం లో హీరో శ్రీకాంత్ తో ఇంటర్వ్యూ తీసుకున్నారు.
ఆ ఇంటర్వ్యూలో యాంకర్ శ్రీకాంత్ తో.. అల్లు అరవింద్ గారు మీ గురించి ఒక వేడుకలో ఒక మాట అన్నారు. తణుకులో చిన్న కుర్రాడిలా అమాయకంగా కనిపించడం, ఆరోజు తనకు హోటల్లో ఆ విషయం ఇంకా గుర్తుంది అని నవ్వుతూ అన్నారు. ఎందుకు మీరు అంత అమాయకంగా కనిపించారు? తణుకు హోటల్లో ఏం జరిగింది? అరవింద్ గారు అది చెప్పినప్పుడు మీ వైపు చూసి అదోలా ఎందుకు నవ్వారు? అని ఇంటర్వ్యూలో యాంకర్ ( Allu Aravind comments on Hero Srikanth ) అడగడం జరిగింది.. దానికి శ్రీకాంత్ ఇలా సమాధానం ఇచ్చాడు. అవును తనకు హోటల్లో నేను ఫ్రెండ్స్ తో కలిసి ఉన్నాను. అప్పుడు మందు నిషేధింపబడిన సమయం. ఆ టైంలో మరుసటిరోజు షూటింగ్ లేదు కదా సరదాగా మందేద్దామని.. ఫ్రెండ్స్ ఆ లోపల వాళ్ళు ఎక్కడి నుంచో ముందు తీసుకొచ్చారు.
అమ్మో ఎందుకు వద్దు అంటే ఆ పర్వాలేదు లైట్గా వేద్దాం అన్నారు. ఇంకా మేము వెయ్యలేదు ఓపెన్ చేసాము ఇంతలో.. అక్కడకి పోలీసులు వచ్చారు. దానితో వెంటనే అందరూ తీసేసి లోపల దాచి పెట్టేసారు ఆ విషయం మరుసటి రోజు అల్లు అరవింద్ గారికి నేను చెప్పాను. షూటింగ్ లేదు కదా అని ఎవరో ఫ్రెండ్స్ తీసుకొస్తే కొంచెం వేద్దాం అనుకున్నా కానీ ఇంతలో ఇలా జరిగిందని చెప్పాము. దాంతో ఆయన తెగ నవ్వారు. ఆ విషయమే ఇప్పుడు గుర్తు చేసుకుని ఆరోజు ఆ వేడుకలు అలా చెప్పారని చెప్పడం జరిగింది మొత్తానికి తణుకు లాడ్జిలో శ్రీకాంత్ పాపం ఫ్రెండ్స్ ఇచ్చినా కూడా తాగడానికి అవకాశం లేకుండా వెంటనే వదిలేయాల్సిన పరిస్థితి వచ్చిందని.. అది దానికి అల్లు అరవింద్ అంతలా గుర్తుంచుకొని నవ్వడం చూసి అందరూ అభిమానులు సరదాగా నవ్వుకుంటున్నారు.