Allari Naresh: అల్లరి అనే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమంలోకి అడుగు పెట్టిన స్టార్ డైరెక్టర్ కుమారుడు నరేష్ ఇక ఆయన నటించిన తొలి చిత్రం అల్లరి అనే చిత్రం కావడంతో ఆ తర్వాత అతని ఇంటి పేరుగా అదే అల్లరి మారిపోయి అప్పటి నుంచే ఆయన అల్లరి నరేష్ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ అల్లరి నరేష్ స్టార్ డైరెక్టర్ ఇ.వి.వి సత్యనారాయణ చిన్న కొడుకు.. పెద్ద కొడుకు కూడా మనందరికీ తెలిసిన వాడే ఆయన పేరు ఆర్యన్ రాజేష్ కానీ అతని కంటే ఎక్కువగా అల్లరి నరేష్ కామెడీ పరంగా ఎన్నో చిత్రాల్లో నటిస్తూ ఒకప్పటి రాజేంద్రప్రసాద్ తర్వాతే కామెడీ హీరోగా అల్లరి నరేష్ అంతటి గుర్తింపు (Allari Naresh Secret) పేరు పొందాడు.
ఇక పలు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు అందక పోవడంతో కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉండి ఆ తర్వాత మహర్షి చిత్రంలో మహేష్ బాబుకి ఫ్రెండ్ గా నటించి తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టాడు. అయితే కామెడీ చిత్రాలను దూరం పెట్టేసి ప్రస్తుతం యాక్షన్ చిత్రాలను చేస్తున్నాడు. అలాంటి అల్లరి నరేష్ గురించి ప్రస్తుతం నెట్టింట్లో వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే నరేష్ చిన్నతనంలో చాలా చిలిపివేషాలు, అల్లరి చేష్టలు చేసేవాడు అంట. దాంతో భరించలేక తన తండ్రి హాస్టల్ లో పడేసాడు. అక్కడ కూడా మా డాడీ పెద్ద స్టార్ డైరెక్టర్ అని హాస్టల్లో అల్లరి నరేష్ చేసిన చిలిపి వేషాలు తెలిసి మీరందరూ షాక్ అవుతారు. చిన్న కొడుకుని గారాబం చేసి పెంచితే చాలా అల్లరి చేసేవారట అందుకే గోల భరించలేక హాస్టల్ లో వేశారు.
కానీ అల్లరి నరేష్ కి హాస్టల్లో ఉండటం అస్సలు ఇష్టం లేదంట. ఎలాగైనా సరే అసలు నుంచి బయటకు వెళ్లాలని ఎన్నో ప్రయత్నాలు చేసేవాడట. ఇక అదే సమయంలో వెంకటేష్ తో హీరోగా పెట్టి అబ్బాయిగారు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అల్లరి నరేష్ హాస్టల్లో బట్టలు ఉతికే దోభి వస్తే అతన్ని పిలిచి మరి మా డాడీ పెద్ద స్టార్ డైరెక్టర్ నేను పెద్ద స్టార్ డైరెక్టర్ కొడుకుని నా బట్టలు మా నాన్నకి అందించండి. కచ్చితంగా మన నాన్న నటించబోయే తర్వాతి చిత్రంలో నీకు కచ్చితంగా అవకాశం కల్పించే విధంగా నేను చేస్తాను నేను ఇప్పిస్తాను అంటూ చెప్పాడట.. (Allari Naresh Secret)
అలా ఆ దోబికి మాయమాటలు చెప్పి అతని బట్టలు ఎలాగైనా తన తండ్రికి అందేలా చేశారట. అయితే ఆ బట్టల్లో ఓ పేపర్ ఉంచాడట. ఆ పేపర్లో ఏం రాసుందరంటే.. నాకు ఇక్కడ అసలు ఉండాలని లేదు దయచేసి తొందరగా నన్ను తీసుకెళ్లండి అంటూ రాసి ఏడుస్తూ ఒక బొమ్మ గీసి పంపించారట.. అలా చిన్న తనంలో అల్లరి నరేష్ చేసిన చిలిపి పనులు చూస్తే ఫ్యామిలీ మొత్తం మాత్రమే కాదు హాస్టల్లో సైతం చాలా మంది విసిగిపోయే వారట మా నాన్న స్టార్ డైరెక్టర్ అంటూ చెప్పుకుని తిరిగే వాడట.