
Ugram movie trailer : అల్లరి నరేష్ కెరియర్ లో ఎన్నో నవ్వులు పండించే మంచి సినిమాలు చేసాడు. తన డైలాగ్స్ తోనే కామెడీని చక్కగా పండించే నటుడు అల్లరి నరేష్. కానీ, మధ్యలో చాల కాలం ఒక మంచి హిట్ లేక అల్లరినరేష్ సతమతమైన సంగతి తెలిసిందే. సినిమా రంగంలో ( Allari naresh Ugram trailer ) ఇది చాలా మామూలు. పెద్ద స్టార్ హీరోలు, డైరెక్టర్లు కూడా ఇలాంటి పరిస్థితిని కొంతకాలం ఎదుర్కోక తప్పదు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన నాంది సినిమా మంచి హిట్ కొట్టింది. ఈ సినిమాలో అల్లరి నరేష్ నటన చాలా అద్భుతంగా ఉంటాది. వీళ్లిద్దరి కాంబినేషన్లో.. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఉగ్రం సినిమా మే 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఉగ్రం సినిమాలో అల్లరి నరేష్ సరసన మీర్నామీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ నెటిజనులను ఆకట్టుకుంది. ట్రైలర్ చివర్లో ‘ఒక మనిషి పోతే నాలుగు రోజులు బాధపడతాం.. అదే మనిషి కనిపించకుండా పోతే మనం పోయేంత వరకు గుర్తు చేసుకుంటూ బాధపడతాం.’ అనే డైలాగ్ చాలా బాగుంది. ఈ సినిమాలో పోలీస్ గా నటిస్తున్నాడు అల్లరి నరేష్. అల్లరి నరేష్ ( Allari naresh Ugram trailer ) ఇంతకుముందు పోలీస్ పాత్ర చేసినా కూడా కామెడీ గా వేసాడు గాని, ఈ సినిమాలో చాల అగ్రసివ్ గా కనిపిస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో కనిపించకుండా పోయిన వారి మీద ఈ సినిమా స్టోరీ ఫోకస్ చేసారు.
దర్శకుడు చాలా మంచి కాన్సెప్ట్ పట్టుకున్నాడని ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. లాక్ డౌన్ సమయంలో మిస్ అవ్వడం అంటే బయటకు వెళ్ళినవారు మాత్రమే కాదు, హాస్పిటల్ కి వెళ్లిన వారు కూడా దృణమైన మోసాలతో ఇక ఇంటికి వచ్చేవారు కాదు. ఒక పేరుమోసిన హాస్పిటల్ లో వైరస్ అని ( Allari naresh Ugram trailer ) అనుమానంతో తమ హాస్పిటల్ కి వచ్చిన అనేక మంది ని వైరస్ వున్నా లేకున్నా వైరస్ అని చెప్పి , ఆ పేషంట్స్ కిడ్నీలు మాయం చేసి , లిట్రల్ గా హత్య చేసి.. కనీసం శవాలని కూడా చూసే అవకాశం లేకుండా ప్యాక్ చేసి దహన సంస్కారాలు చేశారని అప్పట్లో ఒక వార్త హాల్ చల్ చేసింది..
ఆ వార్తలో ఎంత నిజం ఉందొ తెలీదు గాని, ఆ వార్త విని జనాలు భయంతో మనుష్యులు డబ్బు కోసం ఇంతగా దిగజారుతారా అనే అసహ్యంతో, అసహనంతో బయటకు వెళ్లలేక, ఎవ్వరిని కలవలేక, నా అనేవాళ్ల సహాయం, సలహా కూడా తీసుకోలేక ఎందరో ఎంతగానే ఏడ్చారు, నష్టపోయారు. వైరస్ వలన లాక్ డౌన్ పెట్టిన సమయంలో ఆరోగ్యం కోసమే కాకుండా, అవకాశవాదుల స్వార్థపరుల బారిన పడి మిస్ అయిన వాళ్ళు, అన్యాయంగా చనిపోయిన వాళ్ళు మన చూట్టు ఉన్న వాళ్లలో లేదా మనకి తెలిసిన వాళ్లలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక వినకూడని వార్తలు విన్నాము. “డబ్బు కోసం సొంత మనుషులే ఎంత నీచానికైనా దిగజారుతున్న ఈరోజుల్లో ఏదైనా సాధ్యమే”.. అలాంటి సబ్జెక్టు ని ఎన్నుకుని తెరకెక్కిస్తున్న ఈ సినిమా అల్లరి నరేష్ కి మంచి క్రేజ్ తెచ్చిపెడతాదని అనుకుంటున్నారు.