Custody Review అక్కినేని ఫ్యామిలీకి గత కొన్ని ఏళ్లగా టైం చాలా బ్యాడ్‌గా నడుస్తోంది. నాగార్జున తో పాటు కొడుకులు నాగచైతన్య మరియు అఖిల్ నటిస్తున్న సినిమాలు అన్నీ ప్లాప్ అవుతున్నాయి. నాగార్జున ది ఘోస్ట్, చైతాన్య ది థ్యాంక్స్, ఇటు అమీర్‌ఖాన్‌తో కలిసి చేసిన లాల్‌సింగ్ చద్దా, ఇక లేటెస్ట్ గా వచ్చిన అఖిల్ ఏజెంట్ సినిమాలు అన్నీ ఒకదానిని మించిన ప్లాప్ లు అవుతున్నాయి.అయితే లేటెస్ట్క గా నాగచైతన్య కస్టడీ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. బంగార్రాజు సినిమా తర్వాత చైతాన్య మరియు కృతిశెట్టి జంటగా ఉన్న ఈ సినిమా ఈ నెల 12 న రిలీజ్ అవుతుంది.
తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకుడు. శ్రీనివాస్ చిట్టూరి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అరవింద్ స్వామి విలన్‌గా నటించనున్నారు. కస్టడీ ప్రమోషన్స్ లో ఇటీవల మీడియా ఇంటరాక్షన్‌లో నాగ చైతన్య ఇలా అన్నారు.నిరూస్థ్సాహ పడుతున్న అక్కినేని అభిమానులందరికీ కస్టడీతో సూపర్ హిట్ అవుతుందని భరోసా ఇచ్చారు. “మా అభిమానులను సంతోషపెట్టడానికి భారీ హిట్ అందించడానికి మేము ఎల్లప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాము. మంచి సినిమా ఇవ్వడం ద్వారానే అభిమానుల ప్రేమను, ఆప్యాయతలను తీర్చుకోగలం. (Custody Review)
మా ఇటీవలి కొన్ని సినిమాలు పెద్దగా ఆడలేదని నాకు తెలుసు, కానీ కస్టడీ మా అభిమానులు కోసం విజయాన్ని సాధిస్తుందని నేను నమ్ముతున్నాను, ”అని చైతాన్య అన్నారు. ఈ చిత్రం ఒక పోలీసు కానిస్టేబుల్ శివ ప్రయాణాన్ని చూపుతుంది, అతను తనకు న్యాయం చేయగల సత్యాన్ని తెలుసుకున్నాడు. దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. ‘‘సినిమాలోని ప్రతినాయకుడు చనిపోకుండా కథానాయకుడు చూసుకోవాలి అన్నాడు. రాజు అనే గ్యాంగ్‌స్టర్‌ని న్యాయస్థానంలో హాజరుపరచడానికి అతని ప్రత్యర్థుల నుండి రక్షించడానికి శివను పెట్టారు. (Custody Review)
రెండు రోజుల్లోనే శివ తన డ్యూటీని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.ట్రైలర్ విడుదలైన తర్వాత అభిమానుల నుండి మరియు సినీ అభిమానుల నుండి అంత స్పందన రాలేదు. ఈ సినిమాపై చాలా మంది అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకోగా, నెటిజన్లు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. కృతిశెట్టి పాత్రకు మంచి అవకాశాన్ని దక్కించుకుంది అంటున్నారు. ఇక చివరి 40 నిమిషాల సినిమా మాత్రం గూస్‌బంప్స్ తో మోత మోగిపోయేలా ఉంటుందట. ఇక సినిమా విడుదల అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.