Dhootha Trailer Review : అక్కినేని అభిమానులు అందరూ ఈరోజు ఎంతో వేడుకగా నాగచైతన్య పుట్టినరోజుని ఎవరికి తగ్గట్టు వాళ్ళు జరుపుకుంటున్నారు. నవంబర్ 23వ తేదీ నాగచైతన్య పుట్టినరోజు అన్న విషయం మనందరికీ ( Dhootha Trailer Review ) తెలిసిందే. నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా నాగచైతన్య మొట్టమొదటిసారిగా నటిస్తున్న దూత వెబ్ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతుంది. ఈ రోజుల్లో వెబ్ సిరీస్ అన్నిటిని ఎక్కువగా హర్రర్,త్రిల్లింగ్ ని ఇష్టపడుతున్నారు. అదే క్రమంలో ఈ సీరీస్ ను కూడా హర్రర్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం ఎవరు వహిస్తున్నారంటే విక్రమ్.కే. కుమార్.
నాగచైతన్య హీరోగా తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సీరియస్ ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. నాగచైతన్యతో మనం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కే కుమార్. విక్రమ్ కే కుమార్ ( Dhootha Trailer Review ) కాంబినేషన్లో నాగచైతన్య వచ్చే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులను నమ్మేవారు. ఎందుకంటే.. మనం సినిమా అంత మంచి హిట్. కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన థాంక్యూ సినిమా అనుకున్నంత అంచనాలకు వెళ్లకపోగా.. ఫ్లాప్ లిస్టులోకి వెళ్ళిపోయింది. ఈ సినిమాని ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు.
అయినా కూడా నాగచైతన్య ఇప్పుడు మళ్లీ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. నాగచైతన్య కెరీర్లో ఇది మొట్టమొదటి వెబ్ సిరీస్. ఇంతవరకు నాగచైతన్య వెబ్ సిరీస్ లో నటించలేదు. నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన దూత వెబ్ సిరీస్ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.. ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య ( Dhootha Trailer Review ) సమాచార్ అనే దినపత్రికలో సాగర్ అనే జర్నలిస్ట్ గా పని చేస్తున్నాడు. ప్రపంచంలో జర్నలిస్ట్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో చెప్పుకుంటూ వచ్చాడు. అయితే పేపర్లో వచ్చే కార్టూన్లకు సంబంధించినట్టుగా హత్యలు జరుగుతూ వస్తున్నాయి. ఆ హత్యలు వెనుక ఉన్న మిస్టరీని తెలుసుకోవడానికి నాగచైతన్య ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నించే క్రమంలో నాగచైతన్య కొన్ని చిక్కుల్లో దూరిపోతాడు. వాటి నుంచి తనను ఎలా కాపాడుకుంటాడు అనేది ఈ వెబ్ సిరీస్ అని అర్థమవుతుంది.
ట్రైలర్లో ఒక జర్నలిస్టుగా నాగచైతన్య లుక్కు చాలా క్లాస్ గా, డీసెంట్ గా ఉంది. దూత వెబ్ సిరీస్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంటుందని అర్థమవుతుంది. భార్య, కూతురుతో నాగచైతన్య సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. ఒక నిజాన్ని తెలుసుకునే క్రమంలో చాలా త్రిల్లింగ్ గా కథ ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తుంది. నాగచైతన్య నటన కూడా బాగుంది. వెబ్ సిరీస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇందులో పార్వతి తిరువోతు లుక్కు కూడా బాగుంది. అయితే సాధారణంగా వెబ్ సిరీస్ లో బోల్డ్ కంటెంట్, రొమాన్స్ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. కానీ ఈ వెబ్ సిరీస్ లో ఎక్కడా కూడా రొమాంటిక్ సీన్స్ ప్రస్తుతం ట్రైలర్లో చూపించలేదు. కథకు రిలేటెడ్ పాయింట్స్ మాత్రమే చూపించారు. రొమాన్స్ లేకపోతే సిరీస్ సక్సెస్ అవ్వడం కొంచెం కష్టమే అనిపిస్తుంది. మరి సినిమాలకు ఎంత పోటీ ఉందో ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా అంతే పోటీ ఏర్పడింది. ఎప్పటికప్పుడు అన్ని భాషల వెబ్ సిరీస్ ని అన్ని భాషల్లో డక్ చేయడం వల్ల విపరీతమైన కాంపిటీషన్ పెరిగిపోయింది. మరి ఈ కాంపిటేషన్ లో నాగచైతన్య తన మొదటి ప్రయోగాన్ని ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది చూడాలి. డిసెంబర్ ఒకటో తేదీ ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.