Home Cinema Custody: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఈ సారి హిట్ కొట్టడానికి ఫుల్ జోష్...

Custody: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఈ సారి హిట్ కొట్టడానికి ఫుల్ జోష్ మీద వస్తున్నాడు చైతు

Custody: అక్కినేని నాగచైతన్య అక్కినేని వారసునిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి టాలీవుడ్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. హిట్స్ ఫ్లాప్స్ అనే సంబంధం లేకుండా కథ పరంగా ముందుకు వెళుతూ తనదైన శైలిలో సినిమాలలో నటిస్తూ వెళ్తున్నాడు చైతు.. ఇక ఆయన నటించిన కస్టడి చిత్రం ఈ నెల అనగా మే 12 వ తారీకున గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. ఇక ఈ చిత్రానికి తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక సినిమా విడుదల అయ్యే తేదీ రోజు దగ్గర పడుతుండడంతో అక్కినేని నాగచైతన్యతో సహా చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్ లో చాలా బిజీ బిజీగా ఉంది.

See also  Star couple: షాకింగ్.. చైతు సమంతల్లా మరో స్టార్ జంట కూడా విడిపోతున్నారా?

akkineni-naga-chaitanya-custody-movie-trailer

ఇటీవలే ప్రమోషన్ లో భాగంగా కస్టడీ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. కస్టడి (Custody) చిత్రం యొక్క విడుదలైన ఈ ట్రైలర్ అంచనాలను తారు మారు చేస్తూ అందరిని చాలా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో ప్రియమణి ఓ పెద్ద పొలిటిషన్ పాత్రలో మనకు కనిపిస్తుంది. ట్రైలర్ లో కూడా మనం అదే చూసాం.. అదే విధంగా కొన్ని క్లిప్స్ ద్వారా మనకు అర్దం అవుతున్న విషయం ప్రియమణి ఇందులో సీఎంగా కూడా ఉందన్న విషయం మనకు తెలుస్తుంది. ఇక మరదే విధంగా ఇక ఈ సినిమాలో అరవింద స్వామి కూడా ఇంపార్టెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ చాలా మంది ట్రైలర్ చూసి సినిమా అంచనాలను రెట్టింపు చేస్తున్నారు.

See also  Prabhas - Sai Pallavi: బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ చిత్రాన్ని సాయి పల్లవి తో కలిసి నటించకుండా మిస్ చేసుకున్న ప్రభాస్..

akkineni-naga-chaitanya-custody-movie-trailer

ఇదే కాకుండా మరీ ముఖ్యంగా ఈ చిత్రంలో నాగచైతన్య చేసిన యాక్షన్స్ సన్నివేశాలు అందరికీ చాలా బాగా అలరిస్తూ అందరిని ఆకట్టుకుంటూ జనాలు తెగ కామెంట్ చేస్తున్నారు ట్రైలర్ కింద.. ఇక ఇప్పటివరకు నాగచైతన్య చేసిన ఎన్నో రొమాంటిక్ చిత్రాలు రొమాంటిక్ సన్నివేశాలు ఆ లుక్ లోనే మనం చూసాం.. కానీ మొట్ట మొదటిసారి ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ పాత్రలో అది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూస్తున్నామని చెప్పుకొస్తున్నారు. మరదే కాకుండా ఈ సారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా హిట్ కొట్టడానికి ఫుల్ జోష్ మీద వస్తున్నాడు.

akkineni-naga-chaitanya-custody-movie-trailer

ఇదే కాకుండా అక్కినేని అభిమానులు ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూస్తున్నామని ఇక ఇదే కాకుండా రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా నాగచైతన్య కృతి శెట్టి మధ్య వచ్చే సీన్స్ కూడా సినిమాకి చాలా హైలెట్ గా నిలవబోతున్నట్లు మనకు తెలుస్తుంది. ఈ విధంగా గత కొంతకాలంగా హిట్లు లేక అల్లాడుతున్న ఇటు నాగచైతన్య ఆటు కృతి శెట్టికి ఈ సినిమా ద్వారా వీళ్ళిద్దరికీ హిట్టు పడుతుందని చాలామంది అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇక ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రైలర్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి ఏమైందో తెలియాలంటే ఈ చిత్రం గురించి ఈ నెల 12వ తారీకు వరకు ఎదురుచూడాల్సిందే.. మరి ఇక ఈ సినిమా ఎలాంటి హిట్ కొట్టబోతుందో చూద్దాం..