Agent movie : అక్కినేని వారసుడు యూత్ కింగ్ అఖిల్ అక్కినేని హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్ త్రిల్లర్ సినిమాగా రూపొందిన ఏజెంట్ 28 ఏప్రిల్ 2023లో శుక్రవారం నాడు మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై ( Agent movie censor review ) అక్కినేని అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా అఖిల్ సక్సెస్ కోసం అక్కినేని కుటుంబంతో పాటు అక్కినేని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక ఏజెంట్ సినిమాని సురేందర్ రెడ్డి.. చాలా ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. అఖిల్ అక్కినేనిని ఈ సినిమాలో కొత్తగా చూపించడమే కాకుండా, ఆడియన్స్ అతనిని యాక్సెప్ట్ చేసేవిధంగా ఎలా చెయ్యాలో ఛాలెంజింగ్ గా తీసుకుని చేసిన సినిమాగా రూపొందిస్తున్నాడు.
ఏజెంట్ సినిమా సెన్సార్ బోర్డు కి వెళ్ళింది. ఈ సినిమాకి ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తారు సెన్సార్ వాళ్ళు ఎలాంటి రివ్యూ ఇస్తారు అని అందరు ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా చూసి కొన్ని అభ్యంతరమైన పదాలను తొలగించి U /A సెర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాకి U /A దొరకడం అనేది చాలా ( Agent movie censor review ) అదృష్టంగానే భావించడమే కాకుండా.. ఇది అఖిల్ కి శుభసూచికంగానే అనుకోవాలి. ఎందుకంటే స్పై యాక్షన్ మూవీ కాబట్టి.. ఈ సినిమాని ఎక్కువగా పిల్లలు ఇష్టపడతారు. ఇందులో ఏదైనా అభ్యంతరకరమైన సీన్స్ ఎక్కువగా ఉండి ఉంటే.. సినిమాకి A సెర్టిఫికెట్ గాని ఇచ్చి ఉంటె.. చాలా వరకు కలెక్షన్స్ నష్టపోవడానికి అవకాశం ఉంటది. కావున అఖిల్ కి ఇక్కడే శుభ సూచకం మొదలైందని చెప్పుకోవచ్చు.
ఈ సినిమాలో అభ్యంతరకరమైన పదాల వలన మొత్తం ఎనిమిది సీన్స్ కట్ చెయ్యడం జరిగింది. అయితే సెన్సార్ రివ్యూ కి వెళ్లిన ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంది అని అక్కినేని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూడటం జరిగింది. సెన్సార్ వాళ్ళు ఇచ్చిన రివ్యూ ప్రకారం సినిమా పాజిటివ్ గానే రెస్పాన్స్ ఇచ్చారు. అలాగే సినీ ( Agent movie censor review ) వర్గాల్లో కూడా ఈ సినిమా మీద మంచి టాకె వినిపిస్తుంది. ఈ సినిమాలో హీరో యాక్షన్ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయంట. ముఖ్యంగా ఈ సినిమా ముగ్గురు ఏజెంట్లకు సంబంధించి వాళ్ల చుట్టూ వాళ్ళ రిలేటెడ్ కథతో నడుస్తుందట. ఈ ముగ్గురు ఏజెంట్లు కీలకమైన పాత్ర చుట్టూ సినిమా ఉండటం వలన దర్శకుడు వీళ్లపై బాగా శ్రద్ధ పెట్టి.. మంచి అవుట్ ఫుట్ తెచ్చాడట.
ఈ సినిమాలో మూడు పాత్రల నటన, ఆ సీన్స్, స్క్రీన్ ప్లే అన్ని బాగానే ఉన్నాయని, సినిమా పాజిటివ్ గానే ఉందని అంటున్నారు. ఇలాంటి రిజల్ట్ వినడంతో సినిమా కలక్షన్స్ అదరగొట్టే అవకాశం ఉందని.. అభిమానులతో పాటు, సినీ వర్గం కూడా అనుకుంటుందట. ఈ సినిమాలో మమ్ముట్టిది కీలక పాత్ర అవ్వగా.. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఏజెంట్ సినిమా తెలుగు మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఏజెంట్ సినిమా మొత్తం రెండు గంటల ముప్పై ఆరు నిమషాలు రన్నింగ్ టైం ఉందట. సిక్స్ ప్యాక్ తో.. ఇంతవరకు అఖిల్ ని చూడని కోణంలో.. హైపర్ నటనతో ఎలా ఆడియన్స్ ఆకట్టుకుంటాడో.. దర్శుకుడు సురేందర్ రెడ్డి అఖిల్ కి హిట్ ఇచ్చి.. ఎలా తన బ్రాండ్ ని ఇంకా పెంచుకుంటాడో సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి..