
Adipurush Trailer Review : భారతదేశం గర్వించేటి, అనుసరించేటి ఆ శ్రీరామచంద్రుడి గాథ రామాయణం ఎన్ని సార్లు చదివినా, ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు విన్నా తనివి తీరని.. ఇంకా కావాలనిపించే.. అమృత గానం.. అదే మానవ జీవనానికి ఆయువు. అలాంటి కథతో ప్రభాస్ హీరోగా, కృతి శనన్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో, ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న.. ఆదిపురుష్ సినిమా ఫ్రీ రిలీజ్ ( Adipurush Movie Trailer Review ) ఫంక్షన్ ఈరోజు తిరుపతిలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు ఫైనల్ గా ఆదిపురుష్ ట్రైలర్ ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ అభిమానులు ఈరోజు పొద్దున్నుంచి.. ఆయన వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన దగ్గర నుంచి ఫాలో అవుతూ.. ఎప్పుడెప్పుడు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
ఫంక్షన్ స్టార్ట్ అయిన వెంటనే కొంచెం సేపటికి ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ట్రైలర్ నెటిజనులు వీక్షిస్తూ.. దానిపై అనేకమంది రివ్యూలు, రేటింగ్లు ఇస్తున్నారు. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందో.. ఏ ఏ సీన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. భిక్షాందేహి అంటూ ట్రైలర్ మొదలయింది. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ వచ్చి గీత దాటి వచ్చిన సీతాదేవిని ( కృతి శనన్ ) రావణాసురుడు ( Adipurush Movie Trailer Review ) ఎత్తుకుపోవడం సన్నివేశాన్ని చూపించేశారు. అయితే ఈ సన్నివేశం మధ్యలో.. సినిమాలో మాటలు ఉంటాయా లేదా ఇలానే ఉంటదా అనేది తెలియలేదు గాని.. సన్నివేశం అయితే యావరేజ్ గా బాగానే ఉంది. సైఫ్ అలీ ఖాన్ పరభాష వాడు అనే ఫీలింగ్ ఎక్కడా కనిపించలేదు. ఇక సీతాదేవిగా నటించిన కృతి శనన్.. ఈ సీన్లో నటన అనేది ఏమీ కనిపించలేదు.
“వస్తున్నా రావణ నా జానకిని తీసుకెళ్లడానికి ” అనే ప్రభాస్ డైలాగ్ లో ప్రభాస్ కంఠం చాలా బాగుంది. “నా ఆరంభం అధర్మ విధ్వంసంతో మొదలు” అనే డైలాగ్ చాలా బాగుంది. రామాయణం అందరికీ తెలిసిన కథే అయినా.. అందరూ అదే చూడాలా అనే ఫీలింగ్ లేకుండా.. మాటల రచనతో ఆడియన్స్ ని ఆకట్టుకోవాలని అనుకుంటున్నారని అర్థం అవుతుంది. ఎందుకంటే శ్రీరాముడిగా ప్రభాస్ మాట్లాడే ప్రతి మాట, ప్రతి డైలాగ్ కూడా ( Adipurush Movie Trailer Review )ఇప్పటివరకు వచ్చినవి చాలా ఆకట్టుకుంటున్నాయి. ” నాకోసం కాదు, భరతఖండంలో పరస్త్రీ మీద కన్నేసిన వాడకి వెన్నులో వణుకు పుట్టేట్టు మీ పౌరుష పరాక్రమాలు చూపించాలి” తెలియజేయడానికి పోరాడండి పోరాడతారా” అని అడిగే విధానం లో కొంత పోరాడమని చెప్పడంలో బాహుబలిలో అనుష్క రాజ్యంలో యుద్ధం స్టార్ట్ చేసేటప్పుడు అందరిని యాక్టివేట్ చేసిన విధానం కనిపించింది. అలాగే ఈ సీన్ సినిమాలో ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది.
” దూకండి ముందుకు అహంకారం రొమ్ము చీల్చి.. ఎగురుతున్న విజయ పతాకాన్ని పాతండి” అని చెప్పే డైలాగు టైంలో ప్రభాస్ చత్రపతి లో చెప్పే డైలాగ్స్ గుర్తుకొస్తున్నాయి. ఇక సినిమాలో యుద్ధం సీన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ సినిమానే తలపిస్తున్నాయి. పిల్లలు ఈ సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అర్థమవుతుంది. ఆంజనేయస్వామిగా దేవ దత్త పర్ఫెక్ట్ గానే సూట్ అయ్యాడని అనిపిస్తుంది. సీతాదేవి ఆంజనేయ స్వామి మధ్య సంభాషణ పెద్దగా చూపించకపోయినా.. సినిమాలో అది ఇంకా కొంచెం బాగుంటదని అనిపిస్తుంది. ” ఈ దశకంఠుడు పది మంది రాఘవులు కంటే ఎక్కువ” అనే రావణాసురుడు డైలాగ్ కి.. ” పాపం ఎంత బలమైనదైన.. చివరకు గెలిచేది సత్యమే” అనే డైలాగుతో ట్రైలర్ ముగిసింది. ట్రైలర్ చూసిన దాన్నిబట్టి సినిమాలో మ్యూజిక్ బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. సినిమా ఫోటోగ్రఫీ అదిరింది. అలాగే నటులు అందరూ కూడా బాగానే నటించారు అనిపిస్తుంది. ఏది ఏమైనా వేసవి సెలవుల్లో ఈ సినిమా అన్ని వయసుల వారిని అలరిస్తుందని మాత్రం అర్థం అవుతుంది.
రేటింగ్: 3.75/ 5
ట్రైలర్ పై ఒక ఆడియన్ రివ్యూ మరియు రేటింగ్ మాత్రమే.. ట్రైలర్ చూసి మీ రేటింగ్ ఇవ్వండి..