Adipurush : పాన్ ఇండియా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతూ ప్రపంచ స్థాయిలో బాహుబలి హీరోగా మంచి స్థానాన్ని సంపాదించుకున్న ప్రభాస్ సినిమాలంటే కొంచెం భారీ అంచనాలతోనే అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ సినిమా ఆదిపురుష్ ట్రైలర్ చూసి సినీ అభిమానులందరూ ప్రశంసిస్తున్నారు. ట్రైలర్లో గ్రాఫిక్స్, ప్రభాస్ డైలాగ్స్ అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ చూసిన ప్రభాస్ అభిమానులు ( Adipurush movie first review ) ఎంతో ఆనందంగా ఉన్నారు. వాళ్ళ హీరో శ్రీరామచంద్రుడిగా చాలా బాగా కుదిరాడని ఆనందపడుతున్నారు. ఒకరకంగా శ్రీరామచంద్రుడు సంబంధించిన సినిమాలు మన తెలుగు ప్రేక్షకులు అయితే నందమూరి వంశం బాగా అలరించింది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన లవకుశ సినిమా ఇప్పటివరకు ఎవరు మర్చిపోలేరు. అలాగే ఆ రోజుల్లో శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుడు ఫోటోలు అంటే ఎన్టీఆర్ ఫోటోలు ఇళ్లల్లో పెట్టుకునేవారు.
ఆయన అంత బాగా ఆ పాత్రల్లో ఇమిడిపోయారు. ఆ తర్వాత బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం సినిమాని కూడా ప్రేక్షకులు బానే ఆదరించారు. అయితే ఎన్టీఆర్ కి, బాలకృష్ణకి చాలా వరకు ఎన్నో కలుస్తాయి కాబట్టి ఆ పాత్ర సెట్ అయినట్టు అనిపించింది. కానీ ప్రభాస్ వీళ్ళిద్దరికీ చాలా డిఫరెంట్ గా ఉంటాడు.. అలాంటి ప్రభాస్ ( Adipurush movie first review ) శ్రీరామచంద్రుని పాత్రలో సెట్ అవుతాడా? అవ్వడా? ఎలా ఉంటాడు? అని అనుకున్నారు కానీ.. ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగా కుదిరాడని చాలా, బాగుందని అందరూ అనుకుంటున్నారు. ఆది పురుష ట్రైలర్లో గౌరవం జన్మతహారాదు, మన ఖర్మతః వస్తుంది మనం చేసే పనిని బట్టి మనకు విలువ ఉంటాది అనే డైలాగ్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే కొన్ని వేల సంవత్సరాలు తర్వాత తల్లులు వాళ్ళ పిల్లలకి మీ గురించి వీరగాధ చెప్పుకునేలాగా యుద్ధం చేయండి అని ప్రభాస్ పిలుపునిచ్చిన తీరు కూడా చాలా బాగుంది.
ఇంకా రాముని ప్రాణాలే జానకి లో ఉన్నాయి కానీ ప్రాణం కంటే కూడా మర్యాదగా ముఖ్యం అని చెప్పిన డైలాగ్ కూడా చాలా బాగుంది. ఇలా ఈ సినిమాలో ఎంత వర్త్ ఉంది అనేది ఈ ట్రైలర్ చెపుతుంది. సినిమాపై ఎలా ఉంది అనే రివ్యూ సగటు ప్రాక్షకుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత, చూసిన తర్వాతే చెప్పగలడు. కానీ ఆ ( Adipurush movie first review ) సినిమా కోసం పనిచేసే టెక్నీషియన్స్ అందరూ కూడా వాళ్ళు ఎంతోకొంత ఆ సినిమానే చూస్తూ పని చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్లు కూడా మంచి రివ్యూ ఇవ్వగలరు. అలాగే ప్రభాస్ కి డబ్బింగ్ చెప్పిన శదర్ కేల్కర్ ఆదిపురుష్ సినిమా గురించి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. బాహుబలి హిందీ వర్షన్ లో ప్రభాస్ కు డబ్బింగ్ చెప్పిన నటుడు శదర్ కేల్కర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆదిపురుష్ కి కూడా ఆయనే ప్రభాస్ కి హిందీలో డబ్బింగ్ ఇచ్చారు.
ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమా కంటెంట్ ప్రజెంటేషన్ గాని, ఆలోచన ప్రక్రియ గాని అద్భుతంగా ఉన్నాయి అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఈ రివ్యూ చూస్తే ప్రతి సీన్లో ప్రభాస్ కి డబ్బింగ్ ఇచ్చిన ఆయన ఇంత బాగా చెప్పారు అంటే.. మొత్తం సినిమా ఆయనకు తెలిసినా తెలియకపోయినా ప్రభాస్ నటించిన సీన్స్ అన్ని అద్భుతంగా ఉండి ఉంటాయి. ఈ రివ్యూ చాలు మన హీరో రెండు వేల కోట్ల పైగా కలెక్షన్ తేగలరని టాక్ వినిపిస్తుంది. మరి చూడాలి ప్రభాస్ అభిమానుల అంచనాలను ఎంతవరకు రీచ్ అవుతాడో, ఎంత హిట్ అవుతుందో జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిజల్ట్ ఆరోజు చూద్దాం..