Adipurush censor talks : ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్గా ఓంరౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఆదిపురుష్ సినిమా ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమాపై ( Adipurush Censor talks about ) ఇప్పటికే ఎన్నో రకాల కామెంట్స్ ని, ఎన్నో రకాల పాజిటివ్ మరియు నెగటివ్ ప్రచారాలని ఎదుర్కొంటూ వస్తుంది. ఎన్ని వచ్చినా కూడా.. సినిమా అయితే గ్రాండ్ సక్సెస్ అవుతుందని చిత్ర టీం వాళ్ళు చాలా భరోసాతోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి ఎందరో అభిమానులు వచ్చి ప్రభాస్ ని చూసి ఆనందంతో పొంగిపోయారు.
ప్రభాస్ చాలా తక్కువ సేపు మాట్లాడాడని కొంచెం డిసప్పాయింట్ కూడా అయ్యారు. అయితే ప్రభాస్ తక్కువ మాట్లాడతాను.. మీ కోసం ఎక్కువ సినిమాలు చేస్తాను అని అభిమానులకు మాట ఇచ్చాడు. ఇంకా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు ( Adipurush Censor talks about ) అని అందరూ అడగ్గా.. పెళ్లే కదా చేసుకుంటాను.. అది కూడా ఇక్కడే తిరుమలలోనే చేసుకుంటానని చెప్పాడు. దీనితో అభిమానులు అందరూ.. తిరుమలలో పెళ్లి చేసుకుంటాను అన్నాడు అంటే.. ఎవరో తెలుగమ్మాయిని కచ్చితంగా ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని ఉంటాడు.. అతి తొందరలోనే చెప్తాడు అని అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. సినిమా గురించి కొంతమంది నెగటివ్ గా దళితులు సినిమాలోకి రాకూడదు అని సినిమా టీం వాళ్ళు అంటున్నారు అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.
దీనితో సినిమా టీం వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారు. వెంటనే అలర్ట్ అయ్యి.. ఇలాంటి పోస్టర్ మేము రిలీజ్ చేయలేదని, ఇది కావాలని ఎవరో ఇలాంటి పనులు చేస్తున్నారని, వీటిని అస్సలు పట్టించుకోవద్దని, ఆది ఫుల్ సినిమా భారతీయులందరిదీ అని చెప్పుకొచ్చారు. అయితే ఆదిపురుష్ సినిమా ఈరోజు సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్ళు సినిమాకి యూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆదిపురుష్ సినిమాపై సెన్సార్ వాళ్ళు ఇచ్చిన రివ్యూ ప్రకారం ( Adipurush Censor talks about ) సినిమా బాగుందని, పైగా సినిమా రన్ టైం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. బాహుబలి సినిమా కంటే ఆదిపురుష్ సినిమా రన్ టైం ఎక్కువగా ఉంది. ఆదిపురుష్ సినిమా రన్ టైం రెండు గంటల 59 నిమిషాలు ఉంది. అంటే ఇంచుమించుగా మూడు గంటల పాటు ఈ సినిమా ఉంటుంది.
బాహుబలి 1 బాహుబలి 2 కంటే కూడా ఆదిపురుష్ సినిమా రన్ టైం ఎక్కువగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అన్ని గంటలపాటు సినిమాని ఓం రౌత్ ప్రేక్షకులు వీక్షించేలా ఎలా తీసి ఉంటాడో అని అనుకుంటున్నారు. అయితే ఆదిపురుష్ సినిమాలో రాఘవుడిగా ప్రభాస్ ఎంతగా అలరిస్తాడో, ఆరాధన భావాన్ని ఎలా క్రియేట్ చేస్తాడో చూడాలని అభిమానులు కుతూహలంతో ఉన్నారు. ఇక కృతి సనన్ జానకి మాతగా ఎంత బాగా నటిస్తుందో చూడాలని ఉన్నారు. ఇక ఈ సినిమాలో ఎక్కువగా అందరూ హిందీ నటులు ఉన్నారు. మన తెలుగు నుంచి కేవలం ప్రభాస్ ఒక్కడే కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుందో ఎలాంటి సక్సెస్ను సాధిస్తాదో.. అని చూసేందుకు సినీ అభిమానులు అందరూ ఆతృతగానే ఉన్నారు.