Home Cinema Rashmika: హీరోయిన్ రష్మికకు ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు..

Rashmika: హీరోయిన్ రష్మికకు ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు..

actress-rashmika-met-with-small-accidents-fans-in-turmoil

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, రెండు మూడు సినిమాలకే యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకొని స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన వారిలో ఒకరు రష్మిక మందన(Rashmika Accident). నాగ శౌర్య నటించిన ‘ఛలో’ అనే చిత్రం ద్వారా ఆమె మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. అంతకు ముందు ఆమె కన్నడలో అనేక సినిమాలు చేసింది. ఛలో హిట్ అవ్వడం తో ఆమెకి గీత గోవిందం చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ చిత్రం ద్వారా ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

See also  Baby Movie Review: ఈ సినిమా ద్వారా దర్శకుడు ఎం చెప్పాలనుకున్నాడు?

అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్ గా నటించి పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన రష్మిక(Rashmika Accident), ఇప్పుడు పుష్ప ది రూల్ చిత్రం లో నటిస్తుంది. ‘ఎనిమల్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని ఇప్పటికే ఆమె బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఇప్పుడు టాలీవుడ్ ఆడియన్స్ తో పాటుగా , బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘పుష్ప : ది రూల్’ చిత్రంతో మరోసారి ఆమె పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేందుకు సిద్ధం అవుతుంది. ఈ చిత్రం తర్వాత ఆమె బాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ కూడా అయిపోవచ్చు.

See also  Animal : అనిమల్ సినిమా వలన అసలు సంగతి బయటపడింది..

ఇదంతా పక్కన పెడితే రష్మిక సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీస్ లో ఒకరు. తనకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా ఆమె ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఈమధ్య కాలంలో ఆమె సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండడం లేదు. అభిమానులు కూడా రష్మిక కి ఏమైంది, ఈమధ్య అసలు యాక్టీవ్ గా లేదు అని అనుకుంటూ ఉన్నారు.

See also  Baby Movie: తొలిరోజే కాసుల వర్షం కురిపించి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన బేబీ మూవీ కలెక్షన్లు ఎన్ని కోట్లు తెలుసా.?

దానికి కారణం చెప్తూ ఈరోజు ఆమె ఒక పోస్ట్ వేసింది. తనకి ఇటీవలే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందని, ఆ యాక్సిడెంట్ కారణంగానే ఇన్ని రోజులు సోషల్ మీడియా లో కానీ, బయట కానీ తాను కనిపించలేదని, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నానని చెప్పుకొచ్చింది. మన జీవితం చాలా చిన్నది, అందమైనది, ప్రతీ క్షణం ఆస్వాదిస్తూ బ్రతకాలి అంటూ అభిమానులకు చెప్పుకొచ్చింది రష్మిక. ఇంతకు ఆమెకు జరిగిన ప్రమాదం ఏమిటి?, ఎక్కడ ఎలా జరిగింది అనే వివరాలు మాత్రం ఆమె బయటకి చెప్పలేదు.