Home Cinema Rakul Preet Singh: ఒరినాయనో.. రకూల్ మామూలుగా ఆస్తులను కూడబెట్టలేదుగా..ఆమె ఆస్తుల విలువ అన్ని కోట్లా.??

Rakul Preet Singh: ఒరినాయనో.. రకూల్ మామూలుగా ఆస్తులను కూడబెట్టలేదుగా..ఆమె ఆస్తుల విలువ అన్ని కోట్లా.??

Rakul Preet Singh: ఢిల్లీలో పుట్టిన ఈ అమ్మడు గిల్లి అనే కన్నడ చిత్రంతో సినిమా రంగంలోకి ప్రవేశం చేసింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా పరిచయాలు ఏముంది. ఆమె మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్.. తన గ్లామర్ తో తన అంద చందాలతో భారీ స్థాయిలోనే ప్రేక్షకులను మూట గట్టుకున్నదనే చెప్పాలి. ఇక మొదట కన్నడ ప్రవేశం తర్వాత కెరటం అనే చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదాను ముద్ర వేసుకుంది. అగ్ర హీరోలు అయినటువంటి ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగార్జున లాంటి హీరోలతో చిత్రాల్లో నటించి చిందులేసింది. (Actress Rakul Preet Singh)

See also  2023 SIIMA Awards: 2023 సైమా విజేతల లిస్ట్ లో స్పెషల్ ఇదే..

actress-rakul-preet-singh-net-worth-and-assets

ఇక అక్కడితో ఆగకుండా తానేంటో నిరూపించుకునేందుకు తమిళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. ఇక ఆ తర్వాత ప్రస్తుతం టాలీవుడ్ లో సంపాదించుకున్న క్రేజ్ మొత్తాన్ని ఉపయోగించుకుని రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే అదృష్టం తెచ్చి పెట్టిన తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుసగా చిత్రాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని పక్కకు పెట్టి బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 సంవత్సరాలకు పై బడిన రకుల్ గట్టిగానే ఆస్తులను కూడా పెట్టిందని సమాచారం..

actress-rakul-preet-singh-net-worth-and-assets

రకుల్ ప్రీత్ సింగ్ సంపాదించిన ఆస్తుల వివరాలు తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఆమె హైదరాబాద్ తో పాటు ముంబై, వైజాగ్ లాంటి చోట్లలో రకుల్ ప్రీత్ సింగ్ భారీగానే ఆస్తులున్నాయి. హైదరాబాద్లో 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సొంత ఫ్లాట్ ఉన్నదట.. దీని విలువ అక్షరాల ఐదు కోట్ల వరకు ఉంటుందట. ఇక షూటింగ్ సమయంలో హైదరాబాద్ కి వచ్చినప్పుడు రకుల్ తన సొంత ఇంట్లోనే ఉంటుందట.. అదే విధంగా ముంబైలో కూడా రకుల్ కు సొంత ఫ్లాట్ ఉందట.. అలాగే హీరోయిన్ గా సత్తా చూపిస్తూనే వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టింది. (Actress Rakul Preet Singh)

See also  Prabhas birthday special : మనసును టచ్ చేసే ప్రభాస్ బర్త్డే స్పెషల్స్..

actress-rakul-preet-singh-net-worth-and-assets

ఎఫ్ 45 అనే పేరుతో వైజాగ్ లో ఒకటి హైదరాబాద్లో రెండు జిమ్ లు ఓపెన్ చేసి చాలా సక్సెస్ అయ్యిందట.. ఇక రకుల్ తన గ్యారేజ్లో తనకు ఇష్టమైన ఎంతో విలువైన ఖరీదైన కార్లు కూడా కొనుగోలు చేసుకుందట. ఇదే కాక రకుల్ దగ్గర అత్యంత విలువైన ఓ డైమండ్ రింగ్ ఉందట.. దీని విలువ కోట్లలో ఉంటుందని అంచనా.. మొత్తంగా రకుల్ ఆస్తుల విలువ దాదాపు 40 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పలు నివేదికలు వెల్లడించాయి. ఇవే కాకుండా మరొక విషయం.. అది ఏంటంటే.. రకుల్ బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నానితో ప్రేమాయణం నడుస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.. ఇక ఈ విషయాన్ని స్వయంగా రకుల్ ప్రీత్ అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసింది.