
Rakul Preeth Singh: తెలుగులో సూపర్ హిట్ సక్సెస్ సాధించిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు రకుల్ ప్రీత్ సింగ్ నటుడు నిర్మాత అయినటువంటి జాతి భగ్నా తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతూ చివరికి పెళ్లి (Rakul Wedding) అనే బంధంతో ఒకటవ బోతున్నారు. ఈనెల ఫిబ్రవరి 21 వ తారీఖున వీళ్ళిద్దరి వివాహం జరగనున్నట్లు మనకు తెలిసిన విషయమే.
ఎన్నో ఏళ్లుగా డేటింగ్ చేస్తున్న వీళ్ళిద్దరూ వాళ్ళ మధుర క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూనే వచ్చారు. మొత్తానికైతే వీరిద్దరూ వాళ్ళ పెళ్లి పుకార్లకు పులిస్టాప్ పెట్టి వీళ్ళిద్దరి మనసులో మాట తెలియజేశారని చెప్పాలి. ఇన్నాళ్ల మా ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారనుందని స్వయంగా వీళ్లే తెలియజేశారు దాంతో తాజాగా వాళ్ళు షేర్ చేసిన పెళ్లి కార్డు ఫోటో కూడా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి అందులో ఈ జంట ఫిబ్రవరి 21 వ తారీకు బుధవారం తమ ఫెరాస్ జరుపుకున్నట్లు చూపించారు కార్డు చుట్టూ కొబ్బరి చెట్లతో మండపం బ్యాక్ డ్రాప్ లో సముద్రం కూడా ఉంది ఓపెనింగ్ కార్డు నీలం తెలుపు రంగులో ఉంది చూడడానికి ఎంతో ఆకట్టుకుంటూ చూడముచ్చటగా ఉంది.
ఇక అంగరంగ వైభవంగా మూడు రోజులపాటు జరిగే వీళ్ళ వివాహ వేడుకకు రకరకాల డిజైనర్లను కూడా సెట్ చేశారంట రోజుకు ఒక డిజైనర్ తయారు చేసే బట్టలు వీళ్ళు వేసుకోబోతున్నారు అయితే రకుల్ (Rakul Wedding) ఇంకా జాకెట్ గోవాలోనే కలిశారట వీరి ప్రేమకు సంబంధించిన ఎన్నో అందమైన జ్ఞాపకాలు గోవాలో చాలానే ఉన్నాయట అందుకే వివాహం కూడా గోవాలనే చేసుకోవాలని ఫిక్స్ అయినట్టు తాజా సమాచారం.