Actress Pragatis: మన తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్లలో నటి ప్రగతి కూడా మనందరికీ సుపరిచితమే.. ఇక తన గురించి చెప్పాలంటే మల్టీ టాలెంటెడ్ అండ్ మోస్ట్ గ్లామరస్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ప్రగతి ముందు వరుసలో ఎప్పుడూ మనకు కనిపిస్తూనే ఉంటుంది. అయితే పుట్టింది హైదరాబాద్లో అయినప్పటికీ తన డిగ్రీ చదువుతున్న రోజుల్లో తమిళంలో హీరోయిన్ అవకాశం రావడంతో తమిళంలో పలు చిత్రాలు నటించి ఆ తర్వాత మలయాళ భాషల్లో రెండు సంవత్సరాలు దాదాపు ఏడు చిత్రాలకు పైగా హీరోయిన్గా నటించినది. పుట్టింది మన తెలుగు గడ్డలో అయినప్పటికీ ఆ తర్వాత స్థిరపడ్డది మాత్రం చెన్నైలోనే అలా తన కెరీర్ ను ఆరంభంలో హీరోయిన్ గా రాణించినప్పటి మంచి తరుణంలో ఆమెకు పెళ్లి అవ్వడం కారణం చేత సినిమాలకు దూరంగా ఉన్నది కుటుంబ పరిస్థితులు మొత్తం సద్దుమణిగాక మళ్ళీ ఇండస్ట్రీ వైపు పరుగులు తీసింది
అలా ఆమె మళ్లీ మన తెలుగు గడ్డపైనే వచ్చి అనేక చిత్రాలలో అక్క, చెల్లి, అత్త, పిన్ని మొదలైన ఎన్నో పాత్రలలో నటించి మన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. అలా ఇక్కడ తెలుగు పేక్షకుల మదిలో తన దైన శైలిలో ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంతరించుకుంది. కేవలం ఇదే కాకుండా కొత్త క్యారెక్టర్ ఆర్టిస్టులను సైతం తలదన్నేలా సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటూ ఆమె చేసే ప్రతి పనులను షేర్ చేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా లాక్ డౌన్ లో ఆమె సోషల్ మీడియా వాడకం పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే నిత్యం జిమ్ లో ఆమె చేసే వర్కౌట్ వెయిట్ లిఫ్టింగ్ వీడియోలు మనం కుప్పలు తెప్పలుగా చూస్తూ ఉన్నాము. ఇక వాటన్నిటిలో ముఖ్యంగా చెప్పుకోదగాల్సింది ఆమె వెయిట్ లిఫ్టింగ్ వీడియోలను నిత్యం పోస్ట్ చేస్తూనే ఉంటుంది వాటికి వీక్షణాలు కూడా కోట్లలో ఉన్నాయి.
అయితే గ్లామర్ ఫీల్డ్ లో ఉంది కాబట్టి ఆమె ఫిట్నెస్ కోసం ఇలాంటి పనులు చేస్తుంది అని భావించవచ్చు. కానీ తాజాగా ప్రగతిలో ఉన్న తన అసలు కోణాన్ని అందరికీ పరిచయం చేసింది. ఆమెలో మనం ఇన్ని రోజులు ఒకే చూసింది ఒక యెత్తు మనకు కనిపిస్తున్నది మరొక యెత్తు.. ఆమె ఏకంగా ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్ గా మారిపోయినట్లు ఇటీవలే ఓ వీడియోను అందరితో పంచుకోగా అందరూ అవాక్కయ్యేలా ఓరి దేవుడా అంటూ కామెంట్లు చేశారు. నా కొత్త జర్నీ మొదలైంది 2 నెలల క్రితం నా జీవితం ఇంతలా మలుపు తిరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు.
ఇదే నా కొత్త జర్నీ పవర్ లిఫ్టింగ్ రెండు నెలల క్రితమే నా ప్రయాణం మొదలవగా ఇంకా చాలా దూరం పయనించాల్సింది ఉంది. కచ్చితంగా అది కూడా పూర్తి చేసే తీరుతాను.. ప్రస్తుతం నా స్కోర్ 250 కానీ టార్గెట్ మాత్రం చాలా ఎక్కువే ఉంది. అయినా కూడా లక్ష్యాన్ని చేరేవరకు వెనక్కి తగ్గేది లేదంటూ పేర్కొంన్నారు (Actress Pragatis) ప్రగతి. ఈ విషయాన్ని స్వయంగా తన పవర్ లిఫ్టింగ్ వీడియోను తన ఇంస్టాగ్రామ్ ద్వారా అందరితో పంచుకుంది. ఇక ఈ వీడియో చూసిన సామాన్య ప్రజలకు కాకుండా సినీ తారలకు సైతం మైండ్ బ్లాక్ బస్టర్ పోతుంది. ఈమెలో ఇంత టాలెంట్ కూడా ఉందా అంటూ ఒక్కొక్కరు వర్క్ అవుతున్నారు.