Home Cinema Actress Niharika: ఆ స్టార్ హీరో చిత్రంలో బంపర్ ఆఫర్ కొట్టేసిన మెగా డాటర్ నిహారిక

Actress Niharika: ఆ స్టార్ హీరో చిత్రంలో బంపర్ ఆఫర్ కొట్టేసిన మెగా డాటర్ నిహారిక

Actress Niharika: ఇటీవల కాలంలో తరచూ మెగా డాటర్ నిహారిక కొనిదెల అటు సోషల్ మీడియాలోనూ ఇటు వెబ్ మీడియాలోనూ తరచు వార్తల్లో నిలుస్తూనే ఉంది. అంగరంగ వైభవంగా 2020 వ సంవత్సరంలో నిహారిక, చైతన్య జొన్నలగడ్డను వివాహం ఆడింది. అందరి ముందు ఏడడుగులు వేసి తానే నా జీవితం అంటూ తన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకందరికీ తెలిసిందే.. ఇక మెగా అభిమానులంతా మంచి అల్లుడు దొరికాడు అని అనుకున్నారు. నిహారిక కూడా పెళ్లి తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం ఆమె నిర్మాతగా మారింది. అలా ఎందుకు చేసిందంటే.. తను నటించడం చైతన్యకు ఇష్టం లేదని ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగానే వెల్లడించింది. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోతున్నారని విడాకులు తీసుకోబోతున్నారని అందరికీ తెలియడంతో..

actress-niharika-is-back-bumper-offer-for-mega-daughter-in-that-star-hero-movie

మళ్లీ నిహారిక అనూహ్యంగా నటన వైపు పరుగులు తీస్తుంది. ఇక వీళ్లిద్దరూ ఒకరి ఒకరు విడిపోయి విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియడం లేదు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం వాళ్ల వాళ్ల ఇన్స్టాగ్రామ్ లో ఒకరికి ఒకరు అన్ ఫాలో చేసుకోవడం.. వీళ్లిద్దరి ఇంస్టాగ్రామ్ లో నుండి వీళ్లిద్దరు దిగిన పెళ్లి ఫోటోలతో సహా ప్రతి ఫోటో కూడా డిలీట్ చేయడం పెద్ద రూమర్లకే తెరలేపిందని చెప్పాలి. ఇక వీళ్లిద్దరు విడిపోతున్నారని విషయాన్ని కూడా ఇది మరింత బలం చేకూరినట్లు అయింది. అయితే ఈ విషయంపై మాత్రం నిహారిక గాని మెగా ఫ్యామిలీ గాని ఇంతవరకు స్పందించలేదు. నిహారిక తన దాంపత్య బంధం పై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఇక మరొకవైపు నిహారిక నటిగా మరియు నిర్మాతగా సత్తా చాటేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.

See also  Star Heroines: ఓరినాయనో. సినిమాలలో అవకాశాలకోసం అలాంటి పనులు చేసిన స్టార్ హీరోయిన్లు వీళ్ళే..

actress-niharika-is-back-bumper-offer-for-mega-daughter-in-that-star-hero-movie

ఇప్పటికే తను సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా ఏర్పాటు చేసింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తూ వస్తుంది. ఇక పెళ్లి తర్వాత తొలిసారి నిహారిక నటించిన డెడ్ పిక్సెల్ అనే ఓ వెబ్ సిరీస్ ఓటిటి ప్లాట్ ఫారమ్ డిస్నీ ప్లస్ హాస్టల్లో త్వరలోనే విడుదలకు సిద్ధమయ్యింది. ఇకపోతే తాజాగా నిహారిక ఒక స్టార్ హీరో మూవీలో బంపర్ అవకాశం కొట్టేసిందట.. ఇక ఆ స్టార్ హీరో మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తో పుష్ప 2 చిత్రంలో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.. ఇక ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. ఇప్పటికే తొలి భాగం పుష్ప ది రైస్ విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.

See also  Honey Rose: మన తెలుగు దర్శకులు ఏది అడిగినా నో అనే మాట రాకుండా హనీ రోజ్ చేస్తున్న పనులేంటో తెలుసా.?

actress-niharika-is-back-bumper-offer-for-mega-daughter-in-that-star-hero-movie

ఇక ప్రస్తుతం పార్ట్ 2 అంతకుమించి అనేలాగా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నిహారిక కీలక పాత్రలో నటించబోతుందనే సమాచారం మనకు వినిపిస్తుంది. అదే కాకుండా ఈ చిత్రంలో గిరిజన యువతిగా నిహారిక కనిపించనుందట.. ఇక ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ఈ పాత్ర కోసం గతంలో సాయిపల్లవితో సంప్రదింపులు జరిపారట.. కానీ ఆమె పలు కారణాల చేత చేరని చెప్పిందట. ఇక ఇప్పుడు ఇదే పాత్ర కోసం నిహారికను తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో నిహారిక ఇస్ బ్యాక్ అనే ఆమె అభిమానులు యమ సంతోషంలో ఉన్నారు. ఇక పుష్ప 2 లో నటించిన తర్వాత మరి నిహారిక (Actress Niharika) దశ తిరగను ఉందేమోనని అంతా అనుకుంటున్నారు..