
Gajala : సినిమా రంగంలోకి నటీనటులు ఎన్నో ఆశలతో అడుగుపెడతారు. మొదట్లో అవకాశం దొరకడమే ఎంతో అదృష్టంగా భావించి ఆ సినిమా రెమ్యునిరేషన్ ఎంత? ఏ ప్రొడక్షన్లో నటిస్తున్నారు? ఇవన్నీ ( Actress Gajala committed suicide ) ఆలోచించకుండా అవకాశం దొరకడమే అదృష్టంగా నటిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎవరో, వాళ్ళు ఎలా నటించగలరో ఆడియన్స్ కు చూపించాలంటే ముందు ఒక ప్లాట్ ఫామ్ కావాలి. ఆ ప్లాట్ ఫామ్ దొరకగానే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని, ఆడియన్స్ అభిమానాన్ని సంపాదించుకుని తారలుగా వెలగాలని కోరుకుంటారు. అలాగే హీరోయిన్ గజాల మనందరికీ బాగానే తెలుసు. హీరోయిన్ గజాల సినిమా ఇండస్ట్రీలో జానకి వెడ్స్ శ్రీరామ్, స్టూడెంట్ నెంబర్ వన్, అల్లరి రాముడు, కలుసుకోవాలని ఇలాంటి సినిమాలతో తనకు మంచి నేమ్ తెచ్చుకుంది.
స్టూడెంట్ నెంబర్ వన్ లో ఎన్టీఆర్ సరసన నటించి మంచి పాటలతో మంచి డైలాగ్స్ తో ఆమె కంటూ ఒక ఫేమ్ వచ్చింది. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా ఆ సినిమాలో చక్కగా కుదిరింది. ఇలా కెరియర్లో ముందుకు వెళుతూ సక్సెస్ లు చూస్తున్న సమయంలో కొన్ని రోజుల తర్వాత ఈమె సినిమా రంగంలో కనిపించడం మానేసింది. ఆ తర్వాత నెమ్మదిగా ఆడియన్స్ కూడా ఆమెని మరిచిపోయారు.
సినిమా రంగం ( Actress Gajala committed suicide ) ఎంత క్రేజ్ ని క్రియేట్ చేస్తుందో, అంత డిప్రెషన్ కూడా ఒక్కొక్కసారి ఇస్తుంది. క్రేజ్ లో వాళ్లకు ఉన్న ఫాలోయింగ్ చూసినప్పుడు వాళ్లకు కలిగిన ఆనందం.. వాళ్ళు పడిపోయినప్పుడు, సినిమాలు లేనప్పుడు, వాళ్లకు అవకాశాలు రానప్పుడు, టైం బాలేనప్పుడు వాళ్లు పడే డిప్రెషన్ చాలా దారుణంగా ఉంటది.
చివరికి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కూడా వాళ్ళకి వస్తుంటాయి. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఉదయ్ కిరణ్ అతి చిన్న వయసులోనే స్టార్ హీరో క్రేజ్ తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ కేవలం కొన్ని సమస్యలను ఎదుర్కోలేక.. తనకున్న క్రేజ్ పోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకున్న విషయం తెలుగు సినీ ( Actress Gajala committed suicide ) అభిమానులందరినీ ఎంతగా బాధపెట్టిందో మనందరికీ తెలుసు. అలాగే హీరోయిన్ గజాల కూడా అప్పట్లో సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిందంట. అది కూడా ఎన్టీఆర్ వలన సూసైడ్ చేసుకోబోయింది అని ప్రచారాలు కూడా వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ వలన గజాల సూసైడ్ చేసుకోబోయేది అంటూ జరిగే ప్రచారాల్లో.. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఆమెని మీద మోసం చేశాడని కాదు.
జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆమె చేసిన ఒకటి రెండు సినిమాలు మంచి హిట్ కొట్టడంతో ఆ తర్వాత కూడా సినిమాల్లో ఒక అవకాశం కావాలని ఎంత ప్రయత్నించినా నిర్మాతలు గాని దర్శకులు గానీ అవకాశం ఇవ్వలేదంట. అందులో వాళ్ళ లోపం కూడా లేదు ఒకే జంటని కంటిన్యూస్గా చూపించాలని ఎవరు అనుకోరు.. చూడాలని కూడా ప్రేక్షకులు అనుకోరు. ఎక్కడో అలాంటి జంటలు అరుదుగా ఉంటాయి. అటువంటి ఆలోచనతో తనకి అవకాశాలు దొరకడం లేదని గజాల సూసైడ్ ప్రయత్నం చేసిందంట. అలాగే గజాలని ఎవరో హీరో మోసం చేసి, ఆ తర్వాత సైడ్ చేశాడని కూడా అందుకు కూడా ఆమె చాలా డిప్రెషన్ లోకి వెళ్లిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ రెండు వార్తల్లో ఎంతవరకు నిజముందో ఎవరికీ తెలియదు కానీ.. అప్పట్లో ఇలాంటి వార్తలుతో గజాల పేరు మారు మ్రోగింది.