Actress Dimple Hayathi: టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ లా హవా పెరిగిపోయింది. సినీ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యిన పెద్ద హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఆ హీరోయిన్లలో ఒక్కరు నటి డింపుల్ హయతి. నటి డింపుల్ గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ఒక సాంగ్ లో నటించింది. దానికి గాను ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత డింపుల్ కు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈమె వరుసగా సినిమాలతో బిజీ బిజీగా ఉంది.
ఆమె టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ పోతున్న, నాటికీ మంచి హిట్ రాలేదు. డింపుల్ హయతి మాస్ మహారాజ రవితేజ సరసన హీరోయిన్ గా నటించినా సినిమా కిలాడీ. ఈ సినిమాపై నటి భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ ఈ సినిమా తాను అనుకునేంత విజయాన్ని సాధించలేదు. ఈ బ్యూటీ ఇంస్టాగ్రామ్ లో తరచు ఆక్టివ్ గా ఉంటుంది మరియు తన హాట్ పిక్స్ తో అభిమానుల హృదయాలను దోచుకుంటుంది. డింపుల్ హయతి ప్రస్తుతం గోపీచంద్ తో కలిసి రామబాణం అనే సినిమా చేస్తుంది. (Actress Dimple Hayathi)
ఈ సినిమా గోపీచంద్ మరియు శ్రీవాసస్ మూడవ సినిమా. వారిద్దరూ చేసిన సినిమాలు లక్ష్యం, లౌక్యం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో దింపులే హీరోయిన్ గా నటిస్తుంది. తాను ఎన్నో హోప్స్ పెట్టుకున్న కిలాడీ సినిమా అంకునంతా విజయం సాధించలేకపోయింది, ఇపుడు నటి దృష్టి మొత్తం రామబాణం సినిమాపైనే ఉంది. ఈ సినిమా ట్రైలర్ మరియు పాటలకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా శుక్రవారం రోజున రిలీజ్ అవుతుంది.
డింపుల్ హయతి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పదహారేళ్ళ నుండే సినిమా లపై ఇష్టం ఉంది అని చెప్పింది. ఆమె ఇష్టాన్ని ఇంట్లో వాళ్ళు కూడా కాదనలేక ఒప్పుకున్నారట. ఆలా నటి దింపులే చిన్న వయసులోనే సినిమాలకు వచ్చింది. ఇపుడు అమ్మడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమయితేనేమి నటి డింపుల్ చేసే రామబాణం హిట్ కొట్టి తనకు టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చిపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. (Actress Dimple Hayathi)