Home Cinema Anushka Shetty: అనుష్క ఆ వ్యాధి కారణంగా లావెక్కిందా.??

Anushka Shetty: అనుష్క ఆ వ్యాధి కారణంగా లావెక్కిందా.??

Anushka Shetty Weight: సూపర్ సినిమాతో నాగార్జున సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ అందులో సెకండ్ హీరోయిన్గా మన తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. అనుష్క గురించి చెప్పాలంటే పుట్టింది మంగళూరులో, విధ్యాభ్యాసం అంతా బెంగళూరులో.. తన మాతృభాష తుళు, ఇంట్లో కుటుంబ సభ్యులు ముద్దుగా స్వీటీ అని పిలుస్తారు స్నేహితులు అమ్ములు అని పిలుస్తారు. ఇకపోతే అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి.

actress-anushka-shetty-became-fat-because-of-that-disease

అలా సినిమాలో సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ అనుష్కకు మాత్రం గుర్తింపు భారీ స్థాయిలోనే లభించింది. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోలైనటువంటి చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, రవితేజ, మహేష్ బాబు వంటి హీరోలతో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇదే కాక ప్రభాస్ తో కలిసి అనుష్క నాలుగు చిత్రాల్లో నటించింది బిల్లా, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల్లో ప్రభాస్ తో చేసింది. అలా సిల్వర్ స్క్రీన్ మీద వీరి జోడికి మంచి గుర్తింపు రావడంతో సూపర్ జోడిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాక వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని ఇప్పటికి ఎన్నో వార్తల్లో వచ్చాయి.

See also  Amitabh Bachchan : క్రికెట్ పై అమితాబ్ అలాంటి ట్వీట్ చేయడానికి అసలు కారణం అదేనట..

actress-anushka-shetty-became-fat-because-of-that-disease

కానీ వీళ్ళిద్దరూ వారిపై వచ్చిన వార్తలను భిన్నంగా స్పందిస్తూ, మేము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్తున్నారు. ఇకపోతే అనుష్క కేవలం హీరోల సరసనే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా మెప్పించింది. అలా చేసిన సినిమా అరుంధతితో ఒక్కసారిగా తన జీవితం మారిపోయింది. దాని తర్వాత పంచాక్షరి, భాగమతి, నిశ్శబ్దం వంటి చిత్రాల్లో ఈమె నటించింది. ప్రస్తుతమైతే అనుష్క సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ ఎలాంటి సినిమాలు చేయడం లేదు. కానీ ఈ హీరోయిన్ చేతిలో ఉన్న ఒకే ఒక సినిమా నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న సినిమా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

See also  Mrunal Thakur: తెలుగు అభిమానులకు తన మనసులో మాట చెప్పిన మృణాల్ ఠాకూర్ - అరెరే పెద్ద సమస్యే వచ్చిందిగా..

actress-anushka-shetty-became-fat-because-of-that-disease

ఇదిలా ఉంటే తాజాగా.. అనుష్క శెట్టి శివరాత్రి సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి శివాలయానికి వచ్చింది. అనుష్క శెట్టి శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అనుష్క పై ట్రోల్స్ మొదలయ్యాయి. అనుష్క (Anushka Shetty Weight) ఏంటి ఇంత లావు అయిపోయింది అంటూ చాలామంది నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అంతకు ముందుకు ఇప్పటికి అనుష్కలో చాలా మార్పు రావడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. మరికొందరు అనుష్క ఏంటి ఇలా అవుతుంది తనకు థైరాయిడ్ వంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా అందుకే లావు పెరుగుతుందా అంటూ ఆ వీడియోలు చూసిన వాళ్లు కామెంట్లు పెడుతున్నారు..